మహిళలు వంకాయను తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు. వంకాయ తినడం బరువు తగ్గడానికి చాలా మంచిది. ఇది కొవ్వు బర్నింగ్ రేటును మరింత పెంచుతుంది. కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, వంకాయ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చర్మాన్ని లోపలి నుండి మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంచుతుంది. వంకాయ తినటం వల్ల గుండె సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు.
ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. వంకాయలోని ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు ముప్పును తగ్గిస్తాయి. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.
గుండె, ఎముకలు, కండరాలు, నరాల సమస్యలను దూరం చేయడంలో వంకాయ చాలా మంచిది. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. బిపిని నియంత్రించడమే కాకుండా, నరాలకు కూడా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.