Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Smriti Mandhana: స్మృతి మంధాన సిక్స్ ప్యాక్.. ఇందులో నిజమెంత?

Advertiesment
Smriti Mandhana

సెల్వి

, మంగళవారం, 14 అక్టోబరు 2025 (11:20 IST)
Smriti Mandhana
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2025 టోర్నీలో ఆస్ట్రేలియాతో వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మంధాన (66 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80) విధ్వంసకర హాఫ్ సెంచరీతో విజృంభించింది. 
 
ఈ ఇన్నింగ్స్‌లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 వన్డే పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 5 వేల పరుగుల మైలురాయి అందుకున్న బ్యాటర్‌గానూ నిలిచింది. వన్డేల్లో ఆస్ట్రేలియాపై ఐదు 50 ప్లస్ స్కోర్లు చేసిన తొలి బ్యాటర్‌గానూ రికార్డ్ సాధించింది. స్మృతి మంధానకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. 
 
స్మృతి మంధాన సిక్స్ ప్యాక్ ఫొటో అంటూ కొందరు నెటిజన్లు ఈ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రాక్టీస్ సెషన్‌లో అలిసిపోయిన స్మృతి మంధాన తన టీషర్ట్ పైకెత్తి ముఖం తుడుచుకుంటున్నట్లుగా ఉన్న ఈ ఫొటో నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇది ఫేక్ ఫొటో అని స్పష్టంగా తెలుస్తోంది. ఏఐ జనరేటెడ్ లేదా ఎడిటింగ్ ఫొటో అని స్పష్టంగా అర్థమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముద్దు ముంచేసింది.. డోపింగ్ టెస్టులో పాజిటివ్ అని తేలింది..