Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిజ్రాలు ఇంటిపై దాడి చేస్తారని అవమానం భారంతో ఓ మహిళ ఆత్మహత్య

Advertiesment
suicide

ఠాగూర్

, ఆదివారం, 14 సెప్టెంబరు 2025 (09:42 IST)
కొందరు హిజ్రాలు తమ ఇంటికి వచ్చి దాడి చేశారన్న అవమాన భారంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధి గిరిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. నగరంలోని గిరిపురం జయరాజు వీధికి చెందిన యువకుడు పల్లెపోగు గోపీచంద్ రాడ్ బెండింగ్ పనులకు వెళ్తుంటారు. ఆయన ఓ యువతితో ప్రేమలో ఉన్నారు. అయితే, కొంతకాలంగా గోపీచంద్ మద్యానికి బానిసై.. పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నారు. దీంతో ఆ యువతి ఆయనతో మాట్లాడడం మానేసింది. 
 
ఈ క్రమంలో ఈ నెల 10న గోపీచంద్.. ఆమె ఇంటికి వెళ్లి తనతో మాట్లాడాలంటూ గొడవ చేశారు. మరుసటి రోజు ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గోపీచంద్.. యువతి మేనమామను చెంపపై కొట్టారు. అతని ఫిర్యాదు మేరకు గోపీచంద్‌ను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత యువతి మేనమామ తనకు తెలిసిన హిజ్రా సరిత ఎలియాస్ డానియేలుతో పాటు మరో పది మంది హిజ్రాలను తీసుకుని రాత్రి 10 గంటల సమయంలో యువకుడి ఇంటికి వెళ్లారు. 
 
గోపీచంద్ తల్లిదండ్రులు కుమార్ బాబు, సత్యకుమారి (40)లపై దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన సత్యకుమారి ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ వద్ద తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త ఆర్బీఐ మార్గదర్శకాలు- స్మార్ట్ ఫోన్ ఈఎంఐ మిస్ అయితే ఇక ఫోన్ లాక్ అవుతుందట