హిమాచల్ ప్రదేశ్‌లో కీచక టీచర్ : 24 మంది బాలికలకు లైంగిక వేధింపులు

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (14:46 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లాలో జరిగిన ఓ దారుణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు వేధింపులకు దిగాడు. పాఠశాలలో చదువుతున్న 24 మంది బాలికలను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయుడి అసభ్య చేష్టలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో వాటిని భరించలేని బాలికలకు ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ కామాంధ ఉపాధ్యాయుడుని అరెస్టు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... సిర్మౌర్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితం టీచర్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 24 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. టీచర్ చేష్టలు రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో బాధిత బాలికలంతా వెళ్లి ప్రిన్సిపాల్ కాంతాదేవికి ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ ఈ ఫిర్యాదును లైంగిక వేధింపులు నిరోధక విభాగం పోలీసులకు చేరవేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఉపాధ్యాయుడుని అరెస్టు చేశారు. 
 
దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు... సదరు కీచక ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టిన తర్వాత వేధింపులు నిజమని తేలడంతో ఉపాధ్యాయుడుపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోవైపు, ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చి సదరు టీచర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేయగా, వారికి పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం