ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

ఠాగూర్
సోమవారం, 7 ఏప్రియల్ 2025 (08:59 IST)
ప్రియుడు మోజులో పడిన ఆ మహిళ.. కన్నపేగుపై ఉన్న ప్రేమ బంధాన్ని మరిచిపోయింది. అభంశుభం తెలియని బిడ్డపై ఏమాత్రం కనికరం చూపలేదు. ప్రియుడుతో కలిసి ఉండేందుకు పేగుబంధం అడ్డునకుంది. ప్రియుడుతో కలిసి కన్నబిడ్డకు నరకం చూపించింది. హైదరాబాద్ తీసుకెళ్లి మరీ ఒంటినిండా వాతలు పెట్టింది. ఈ ఘటన కొన్ని రోజుల క్రితం జరుగగా, ఆదివార వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ రూరల్ మండలి జక్కంపూడి కాలనీకి చెందిన వందన అనే మహిళకు మూడేళ్ల కుమార్తె ఉంది. తల్లిదండ్రులు వివాహం చేసిన భర్తను వదిలివేసి మరో వ్యక్తితో కలిసి వందన సహజీవనం చేసింది. ఆ తర్వాత చిట్టినగర్‌కు చెందిన శ్రీరాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత వందన తన కుమార్తెను తీసుకుని శ్రీరాములుతో కలిసి హైదరాబాద్ నగరానికి వెళ్లిపోయింది. అయితే, అక్కడ తమ సుఖానికి అడ్డుగా కన్నబిడ్డ ఉండటాన్ని వందన జీర్ణించుకోలేకపోయింది. దీంతో తన ప్రియుడితో కలిసి కుమార్తెను చిత్రహింసలకు గురిచేయసాగింది. 
 
ఈ క్రమంలో ఆమె ఒంటినిండా వాతలు పెట్టింది. అలా 20 రోజుల పాటు చిత్రహింసలు పెట్టిన తర్వాత చిన్నారిని తీసుకుని విజయవాడ రైల్వే  స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీరాములు తన తల్లి సుమలతకు ఫోన్ చేసి స్టేషన్‌కు పిలిపించుకుని ఆ చిన్నారిని వారికి అప్పగించి ఆ తర్వాత వారిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. దీంతో సుమలత ఆ చిన్నారిని ఇంటికి తీసుళ్లి పరీక్షించగా, ఒంటినిండా వాతలు ఉండటంతో స్థానిక వైద్యుడు వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించింది. 
 
కొన్ని రోజులకు శ్రీరాములు, వందనలు విజయవాడకు ఆ చిన్నారి కోసం వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వారిద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారు పారిపోయారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న ఆ మహిళ, ఆమె ప్రియుడు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments