Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు చక్కెరతో దోసెలు, చపాతీలు తినిపిస్తున్నారా?

పిల్లలు పంచదారను ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే కాస్త జాగ్రత్తపడాలి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. పిల్లలకు చక్కెరను ఎక్కువ అలవాటు చేస్తే.. గుండె సంబంధిత వ్యాధులు అధికంగా వస్తాయని వారు హెచ్చరిస్తున

Webdunia
సోమవారం, 15 మే 2017 (15:32 IST)
పిల్లలు పంచదారను ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే కాస్త జాగ్రత్తపడాలి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. పిల్లలకు చక్కెరను ఎక్కువ అలవాటు చేస్తే.. గుండె సంబంధిత వ్యాధులు అధికంగా వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు కారం కాసింతైనా అలవాటు చేయాలి. అలా కాకుండా చక్కెరను తదేకంగా అలవాటు చేస్తే.. అందులోని ఫ్యాటీ ఆమ్లాలు జీవక్రియ వేగాన్ని దెబ్బతీస్తాయి. ఫలితంగా గుండెజబ్బులు తప్పవని తాజా పరిశోధనలో తేలింది. 
 
ఈ మేరకు జరిగిన ఓ పరిశోధనలో పంచదార అధికంగా తీసుకునే పిల్లలో జీవక్రియను దెబ్బతీసే ఓలియాక్‌ ఆమ్లం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. పంచదారను ఎక్కువగా తినడం వల్ల అది ఫ్యాటీ ఆమ్లాల అరుగుదల మీద తీవ్ర ప్రభావాన్ని కనబరుస్తుంది. తద్వారా కాలేయ వ్యాధులతో పాటు హృద్రోగ సమస్యలకు దారితీసే అవకాశం ఉందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
 
అందుకే పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు కూర, పప్పును అలవాటు చేయాలి. అంతేగాకుండా దోసెలు, చపాతీలకు పంచదారతో కలిపి తినిపిస్తే అనారోగ్య సమస్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. ఇంకా మోతాదుకు మించి చక్కెరను వాడటం ద్వారా దగ్గు, జలుబు, అలెర్జీలు వంటి సమస్యలు ఏర్పడతాయి. వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. జీర్ణక్రియ దెబ్బతింటుంది. అందుకే పిల్లలు తాగే పానీయాల్లో పంచదార శాతం మోతాదుకు మించకూడదని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

యజమానిని చంపేసిన పెంపుడు కుక్క... ఎక్కడ?

Mahanadu: కడపలో టీడీపీ మహానాడు.. శరవేగంగా ఏర్పాట్లు.. పసందైన వంటకాలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

తర్వాతి కథనం
Show comments