కర్నాటక సీఎం మార్పు తథ్యమా? సిద్ధూ లభించని కాంగ్రెస్ నేతల అపాయింట్మెంట్...

ఠాగూర్
సోమవారం, 10 నవంబరు 2025 (18:12 IST)
కర్నాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. ఈ ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు సమయం కేటాయించేందుకు నిరాకరించినట్టు సమాచారం. కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమనే ప్రచారం గత కొంతకాలంగా విస్తృతంగా సాగుతోంది. ఈ క్రమంలో సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగుళూరు - ఢిల్లీల మధ్య పర్యటిస్తున్నారు. నవంబరు నెలాఖరు నాటికి రాష్ట్ర రాజకీయాల్లో మార్పు చోటుచేసుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య మరోమారు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పెద్దలతో కూడా సమావేశం కావాలని ఆయన భావించారు. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానం పెద్దల అపాయింట్మెంట్ కోరగా, అందుకు కాంగ్రెస్ పెద్దలు నిరాకరించినట్టు సమాచారం.
 
అయితే, సిద్ధరామయ్య తన ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. మరో రెండున్నరేళ్లు తమ పార్టీయే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ కు ఎదురైన ప్రశ్నల సారాంశంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి

Bindu Madhavi: అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగితే ఏమయిందినే కథతో దండోరా సిద్ధం

Balakrishna 111: గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ గోపీచంద్ తాజా అప్ డేట్

AR Rahman: నా చైల్డ్‌హుడ్‌ డ్రీం పెద్ది తో తీరింది : రామ్ చరణ్

చిరంజీవిని క్షమాపణలు కోరిన వర్మ ... ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments