Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో చీరతో కట్టిన ఊయల ఊగుతూ బాలిక మృతి

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (11:13 IST)
ఇంట్లో చీరతో కట్టిన ఊయల ఊగుతూ ఓ బాలిక మృతి చెందింది. ఈ ఘటన నాచారంలో గురువారం సాయంత్రం విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే, నాచారంలోని మజీద్‌బాబానగర్‌లో నివాసముంటున్న ఒల్లూరి రమే్‌షకు భార్య, కూతురు మనస్విని (10), ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. రమేష్‌ దంపతులిద్దరూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 
 
కొడుకు పుట్టినప్పటి నుంచి మానసిక వ్యాధితో బాధపడుతుండగా, మనస్విని హబ్సిగూడలోని బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌లో 4వ తరగతి చదువుతోంది. రమేష్‌, అతడి భార్య గురువారం ఉదయం ఉద్యోగానికి వెళ్లగా, అతని తల్లి ఉమారాణి ఇంట్లో ఉంది. ఈమె రెండు రోజుల క్రితం కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకుని విశ్రాంతి తీసుకుంటోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటిలో మనస్విని తనకు తానుగా చీరతో ఉయ్యాల కట్టుకుని ఊగుతోంది. 
 
ఈ క్రమంలో ఊయలలో గుండ్రంగా తిరుగుతుండగా ప్రమాదవశాత్తు మెడకు చీర బిగుసుకుని ఊపిరాడక మృతి చెందింది. నిద్రపోతున్న నానమ్మ లేచి చూసేసరికి మనస్విని చనిపోయి కనిపించడంతో గట్టిగా కేకలు వేసింది. గమనించిన చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకుని బాలిక మెడ నుంచి చీరను వేరు చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments