Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

Advertiesment
Rajinikanth

ఠాగూర్

, బుధవారం, 29 అక్టోబరు 2025 (17:45 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఇదే తరహా రూమర్స్ వచ్చినప్పటికీ ఆయన కొట్టిపారేశారు. కానీ, ఈ దఫా మాత్రం సినిమాలకు టాటా చెప్పేసి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని భావిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఆయన లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో "జైలర్-2" చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత తన కెరీర్‌లో "అరుణాచలం" వంటి బ్లాక్ బస్టర్ హిట్ వంటి చిత్రాన్ని అందించిన సుందర్ సి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు సమ్మతించినట్టు సమాచారం. 
 
ఆ రెండు చిత్రాల తర్వాత అగ్ర నటుడు కమల్ హాసన్ సొంతంగా నిర్మించే ఓ చిత్రంలో నటించనున్నారు. ఇందులో కమల్ హాసన్ కూడా నటించనున్నారు. పైగా, ఈ ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చినప్పటికీ దర్శకుడు ఎవరన్నది మాత్రం తెలియాల్సివుంది. అయితే, కమల్‌తో నటించే చిత్రమే రజనీకాంత్ కెరీర్‌లో చివరి చిత్రం అవుతుందనే ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 
 
అదేసమయంలో రజనీకాంత్ ఇటీవలికాలంలో ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తనకు ఖాళీ సమయం లభిస్తే చాలు... ఆయన హిమాలయా పర్యటనలకు వెళ్లిపోతున్నారు. దీంతో రజనీకాంత్ చివరి చిత్రంపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై రజనీకాంత్ ఫుల్‌స్టాఫ్ పెట్టాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్