Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Advertiesment
Faria Abdullah, A Kodandarami Reddy, B Gopal, Vaibhav, Manasa Varanasi, Daksha Nagarkar

దేవీ

, సోమవారం, 25 ఆగస్టు 2025 (11:14 IST)
Faria Abdullah, A Kodandarami Reddy, B Gopal, Vaibhav, Manasa Varanasi, Daksha Nagarkar
దుబాయ్‌లో గామ (Gulf Academy Movie Awards) అవార్డ్స్ నాలుగు ఎడిషన్లు  అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు 5వ ఎడిషన్ వేడుకలు  ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌‌లో గ్రాండ్‌గా జరగనుంది. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి టైటిల్స్ స్పాన్సర్ గా వైభవ్ జ్యువెలర్స్ సంస్థ వ్యవహరిస్తోంది.
 
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గామా సీఈవో సౌరబ్ కేసరి, వైభవ్ జ్యువెలర్స్ ఎండి రాఘవ్, జ్యూరీ సభ్యులు, ప్రముఖ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి గారు, బి గోపాల్ గారు, హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్షా నాగర్కర్, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా గామా సీఈవో సౌరబ్ కేసరి మాట్లాడుతూ.. "ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈవెంట్ కాదు. మా నాన్న (త్రిమూర్తులు) గారికి కళాకారులపై ఉన్న అభిమానం తో గామా అవార్డ్స్  నిర్వహిస్తున్నాం. అందరి సపోర్ట్ తో ముందుకు వెళ్తున్నాం. వచ్చే ఏడాది మరింత గ్రాండ్ గా అవార్డ్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఇతర దేశాల్లోను గామా అవార్డ్స్ ఇచ్చేలా సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.
 
జ్యూరీ సభ్యులు ఏ కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి అవార్డ్స్ నటీనటులకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లాంటివి. ప్రతి ఒక్కరినీ ఎంకరేజ్ చేసేలా ఉంటాయి. ఆగస్టు 30న దుబాయ్ లో జరగనున్న ఈ గామా అవార్డ్స్ విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
 
 జ్యూరీ సభ్యులు  బి గోపాల్ గారు మాట్లాడుతూ, ఈ ఏడాది కూడా అంతకుమించేలా సౌరబ్ కేసరి  అన్ని ఏర్పాట్లు చేశారు. అతిరథ మహారధుల సమక్షంలో హీరోయిన్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ లతోఈ ఈవెంట్ జరగనుంది" అని చెప్పారు.
 
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.." గతేడాది జరిగిన ఫోర్త్ ఎడిషన్ గామా అవార్డ్స్ లో  స్పెషల్ పెర్ఫార్మన్స్ చేశాను  ఈసారి కూడా స్పెషల్ పెర్ఫార్మన్స్ తో అలరించబోతున్నా" అని చెప్పారు. హీరోయిన్ మానస వారణాసి మొదటిసారి గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫార్మన్స్ చేయబోతున్నారని చెప్పారు. ఈ వేడుకలో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉందని హీరోయిన్ దక్షా నాగర్కర్ అన్నారు.
గామా అవార్డ్స్ లో యాంకర్ సుమతో పాటు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న నటుడు వైవా హర్ష మాట్లాడుతూ.. " సుమ గారితో వ్యాఖ్యాతిగా వ్యవహరించడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది.ఈ వేడుక చాలా ఎంటర్టైనింగ్ గా జరగబోతుంది" అని చెప్పారు.
 
ఆగస్టు 30న  టాలీవుడ్ అవార్డ్స్ తో పాటు ఆగస్టు 29న  ఎక్సలెన్స్  అవార్డ్స్  వేడుకను నిర్వహించేలా భారీ సన్నాహాలు జరుగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం