Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

దేవీ
సోమవారం, 2 జూన్ 2025 (13:27 IST)
Rajendra Prasad speech
లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూశాక ఇళయరాజాగారు నన్ను చూసి  మొదటిసారిగా ఓరేయ్ అని పిలిచారు నన్ను. అది ప్రేమ. ఆయన నాతో అలా సరదాగా వుంటారు. అది నాకు అలవాటు అయింది. చాలామంది పెద్దలు నన్ను సరదాగా పిలుస్తుంటారు. అలాంటిది ఈమధ్య కొన్ని ఫంక్షన్లలో నేను మాట్లాడిన మాటలు కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అది మీ ఖర్మ. అది మీ సంస్కారం మీద ఆదారపడి వుంది. నేనే మీ తప్పు మాట్లాడలేదు. నేను చాలా సరదగా వుంటాను. నా స్నేహితులు, కలిసి చేసిన నటులతో నా గురించి వారికి తెలుసు. నేను ఎవరిని పిలిచినా సరదాగా పిలుస్తాను అన్నారు.
 
సోమవారంనాడు షష్టిపూర్తి సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. నేను మీడియాను ఫ్యామిలీ మెంబర్లా చూస్తుంటాను. మీరు నాతో అలానే వున్నారు. నేను సరదాగా మీతో వుంటాను. ఇక అది పక్కన పెడితే.. షష్టిపూర్తి సినిమా నేను చేయడం గర్వకారణం. దేవుడు నాకిచ్చిన వరం. పెళ్లిపుస్తకం చేశాను.  మళ్ళీ దేవుడు పెండ్లిలో చిలిపిసరదాలు కాదురా.. షష్టిపూర్తి కూడా నువ్వు చేయ్. ఆ సాధకబాధలు తెలుస్తాయని  దేవుడు అన్నట్లు ఈ కథ విన్నాక అనిపించింది. దర్శకుడు పవన్ ప్రభ రాసిన కథ చాలా బాగుంది. తన మదర్ చనిపోతే పేరులో ప్రభ రావాలని పవన్ ప్రభగా పెట్టుకున్న మానవత విలువలు, పెద్దల పట్ల గౌరవం వున్న వ్యక్తి పవన్ ప్రభ అన్నారు.
 
ఇక నిన్న హైదరాబాద్ లో ఎస్.వి. క్రిష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. ఆ ప్రోగ్రామ్ కు మీడియాను పెద్దగా పిలవలేదు. కొన్ని ఛానల్స్ మాత్రమే వచ్చాయి. అదికూడా లైవ్ వుందని తెలీదు. ఆ సందర్భంగా తను అన్నమాటలు ఇలా  వక్రీకరించారని రాజేంద్రప్రసాద్ మేనేజర్ తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో కేవలం 47 శాతం పోలింగ్ మాత్రమే నమోదు

కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన యూఐడీఏఐ

ఢిల్లీ పేలుళ్ళ వెనుక రెసిడెంట్ డాక్టర్ - పోలీసుల అదుపులో ఫ్యామిలీ మెంబర్స్

ఎర్రకోట మెట్రో స్టేషన్ పేలుడు.. 12కి పెరిగిన మృతుల సంఖ్య

తాడిపత్రిలో వైకాపా నేత ఆర్సీ ఓబుల్ రెడ్డిపై దాడి - ఉద్రిక్తత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

తర్వాతి కథనం
Show comments