Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిలియన్ల ఆస్తి సంపాదించా, కానీ ఐ.టీ.కి దొరకను : అనిల్ రావిపూడి

Advertiesment
Anil Ravipudi

డీవీ

, బుధవారం, 22 జనవరి 2025 (15:42 IST)
Anil Ravipudi
నిన్ననే చిత్ర నిర్మాత దిల్ రాజు ఇంటిపై ఇన్ కమ్ టాక్స్ దాడులు జరిగాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఆయన తీశారు. సరైన లెక్కలు చూపించలేదని అందుకే వివరాలకోసం ఐ.టి.దాడి జరిగిందని అధికారులు మీడియాకు చెప్పారు. మరి ఆ సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడిమీద ఐ.టి. దాడులు ఎందుకు జరగలేదు? అనే ప్రశ్న తలెత్తింది. పటాస్ నుంచి పదేళ్ళలో 8 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్, కలెక్షన్స్ చూసి నేనేనా? ఈ సినిమా తీసింది? అనే అనుమానం కూడా అప్పుడప్పుడు నాకు కలుగుతుంది అంటున్నారు.