పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్, బాలీవుడ్ నటి వాణీ కపూర్ జంటగా నటించిన "అబీర్ గులాల్" చిత్రంపై కేంద్రం నిషేధం విధించింది. కాశ్మీర్ లోయలోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు ఈ నెల 22వ తేదీన దాడికి తెగబడి 25 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో దేశీయంగా పాకిస్థాన్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, పాకిస్థాన్‌పై భారత్ దౌత్య యుద్ధం ప్రకటించింది. ఇందులోభాగంగా, వచ్చే నెల 9వ తేదీన అబీర్ గులాల్ విడుదలకానుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ చిత్రంపై నిషేధం విధించాలన్న డిమాండ్లు పుట్టుకొచ్చాయి. దీంతో కేంద్రం కన్నెర్రజేసింది. ఈ సినిమా భారత్‌లో విడుదలకాకుండా నిషేధం విధించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) నడుపుతున్న బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ సంఘటన ఏప్రిల్ 14న జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై బాలిక తండ్రి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, బస్సు సిబ్బంది అధికారిక అనుమతి లేకుండా అనధికార ప్రయాణికులను బస్సు ఎక్కడానికి అనుమతించారని ఆరోపించారు. ఇంకా, సంఘటన జరిగిన సమయంలో బస్సులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని తండ్రి పేర్కొన్నారు. ఈ అమానవీయ సంఘటన, సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జవాబుదారీతనం లోపాన్ని విమర్శించారు.

కాశ్మీర్ లోయలోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని యావత్ భారతదేశమే కాదు పలు ప్రపంచ దేశాలు ఖండించాయి. కానీ, దాయాది దేశమైన పాకిస్థాన్ మాత్రం ఈ దాడిపై ఇంతవరకు నోరు మెదపలేదు. ఈ దాడి నేపథ్యంలో దాయాది పాకిస్థాన్‌తో సంబంధాలపై భారత ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అదేసమయంలో పాకిస్థాన్ నటీనటులు భారతీయ చిత్రాల్లో నటించడానికి వీల్లేదంటూ నెట్టింట షేర్ చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా పాకిస్థాన్ మూలాలు ఉన్న ఇమాన్వీ ఎస్మాయిల్‌ పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చారు.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ సంఘటన తర్వాత, అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.జనరల్ అసిమ్ మునీర్, అల్-ఖైదా మాజీ చీఫ్, క్రూరమైన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ మధ్య చాలా తక్కువ తేడా ఉందని మైఖేల్ రూబిన్ ఆరోపించారు. "ఒసామా బిన్ లాడెన్ ఒకప్పుడు గుహ నుండి కార్యకలాపాలు నిర్వహించేవాడు. అయితే పాకిస్తాన్ ప్రస్తుత ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఒక విలాసవంతమైన రాజభవనంలో నివసిస్తున్నాడు. ఇద్దరి మధ్య ఉన్న ఏకైక ముఖ్యమైన తేడా అదే" అని రూబిన్ పేర్కొన్నాడు.

భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలు టీ20ల్లో అరుదైన రికార్డును నెలకొల్పారు. స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ పోటీల్లో భాగంగా, బుధవారం రాత్రి ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో హైదరాబాద్‌ను ముంబై జట్టు ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. జట్టు విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. మొత్తం 70 పరుగులు చేసిన రోహిత్... ఈ క్రమంలో టీ20ల్లో 12 వేల పరుగుల ఫీట్‌ను పూర్తి చేశాడు. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తర్వాత ఈ అరుదైన ఫీట్‌ను సాధించిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే, భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20 క్రికెట్‌లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న భారత బౌలర్‌గా రికార్డు సాధించాడు.

ఏకాదశి అనేది విష్ణువుకు అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ఏకాదశి ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది, శుక్ల పక్షం, కృష్ణ పక్షం రెండింటిలోనూ ఏకాదశి వస్తుంది. వరూథిని ఏకాదశి అనేది ముఖ్యమైన ఏకాదశి పండుగలలో ఒకటి. ఇది చైత్ర లేదా వైశాఖలో కృష్ణ పక్షం 11వ రోజున జరుపుకుంటారు. వరూధిని ఏకాదశి విష్ణువు వామన అవతారానికి అంకితం చేయబడింది. ఈ పవిత్రమైన రోజును ఉత్తర భారతదేశంలో వైశాఖ మాసంలో పాటిస్తారు. దక్షిణ భారతదేశంలో, ఈ రోజును చైత్ర మాసంలో పాటిస్తారు. ఈ రోజున ఎవరికైనా లేదా బ్రాహ్మణులకు నీటి కుండను దానం చేయడం వల్ల సూర్యగ్రహణ సమయంలో బంగారం దానం చేసిన ఫలితం దక్కుతుంది. ధాన్యం దానం చేసినా అద్భుత ఫలితాలు ఉంటాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్ పౌరులు వెంటనే భారతదేశాన్ని విడిచిపోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది. పర్యాటకులైనా, ఇతర కారణాలతో భారత్‌లో ఉన్న పాక్ పౌరులైనా ఇప్పుడే వెళ్లిపోవాల్సిందే అని ప్రకటించింది. ఇకపై పాకిస్థాన్‌ పౌరులకు వీసాలు మంజూరు చేయబోవడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇప్పటికే వీసాలు పొందినవారు కూడా ఇండియాలో ఉండడానికి వీలులేదని ఆదేశించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యవసరంగా నిర్వహించిన భద్రతాపై కేబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

అక్షయ తృతీయ నాడు శుభకార్యాలు చేసేందుకు శుభం. ఈ రోజున ఎటువంటి శుభ కార్యాలు చేయడానికి ప్రత్యేక శుభ సమయం అవసరం లేదు. 'అక్షయం' అంటే నాశనం కానిది, శాశ్వతమైనది. ఈ రోజున చేసే శుభ కార్యాల వల్ల కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్ని రెట్లు పెరిగి శాశ్వతంగా ఉంటాయని విశ్వాసం. ఈ సంవత్సరం, అక్షయ తృతీయ ఏప్రిల్ 30, 2025న వస్తుంది. ఈ సంవత్సరం, అక్షయ తృతీయ అనేక ప్రత్యేక యోగాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జరుగుతున్నాయి. ఈ రోజున అనేక అరుదైన, అత్యంత శుభప్రదమైన రాజయోగాలు ఏర్పడతాయి. ఇది సంపద, శ్రేయస్సు,కొత్త ప్రారంభాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున చతుర్గ్రాహి యోగం, మాలవ్య యోగం, లక్ష్మీ నారాయణ యోగం, గజకేసరి యోగం, రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం వంటి యోగాలు ఏర్పడతాయి.

పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి తనను తీవ్రంగా కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేస్తూ, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు పాటిస్తుందని ప్రకటించారు."పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి గౌరవార్థం, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలను పాటిస్తుంది. మేము మా పార్టీ జెండాను అవనతం చేస్తున్నాము" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సవాలుతో కూడిన సమయంలో ఐక్యతకు పిలుపునిస్తూ, ఏ ఉగ్రవాద చర్య కూడా భారతదేశ ఐక్యతను నాశనం చేయలేదన్నారు.