Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్హులైన అందరికీ ఇళ్ళ పట్టాల క్రమబద్దీకరణ..

Advertiesment
Andhra Pradesh
, శుక్రవారం, 25 అక్టోబరు 2019 (16:40 IST)
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అధిక భాగం కొండ ప్రాంతంలో నివసిస్తున్న వారికి ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రువారం ఒకటో పట్టణ బ్రాహ్మణ విధి జమ్మి చెట్టు వద్ద నున్న దేవదాయ శాఖ భవన సముదాయంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జేసీ మాదవి, సబ్ కలెక్టర్ ధ్యాన చంద్, ఎమ్మార్వోలు సుగుణ, రవీంద్ర మరియు రెవిన్యూ అధికారులతో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన అందరికీ ఉగాది నాటికి ఇళ్ళు, ఇళ్ళ పట్టలు ఇవ్వాలని సిఎం జగన్ మోహన్ రెడ్డి అశయ సాధనలో భాగంగా రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. పశ్చిమ నియోజక వర్గంలో 20 డివిజన్లలో అధిక భాగం కొండ ప్రాంత వాసులనీ వీరికి ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ చేయించేందుకు, రైల్వే, ఇతర ప్రభుత్వ భూములలో నివసించే వారికి క్రమ బద్దీకరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇందునిమితం అవసరమైతే సర్వే నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నజీయర్ స్వామితో మంత్రి వెల్లంపల్లి భేటీ