Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'పుష్ప-2' చిత్రం చూస్తూ అభిమాని మృతి (Video)

Advertiesment
bunny fan boy

ఠాగూర్

, మంగళవారం, 10 డిశెంబరు 2024 (15:39 IST)
అనంతపురం జిల్లా రాయదుర్గంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన "పుష్ప-2" చిత్రం చూస్తూ వీరాభిమాని ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాయదుర్గంలో 'పుష్ప-2' సినిమా ప్రదర్శిస్తున్న థియేటరులో ముద్దానప్ప అనే ప్రేక్షకుడు ప్రాణాలు కోల్పోయాడు.
 
షో ముగిశాక కూడా సీటులో అలానే కూర్చొని ఉండటంతో ప్రేక్షకులు అనుమానించి థియేటర్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ముద్దానప్ప అచేతనస్థితిలో పడిపువుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ముద్దానప్ప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
మరోవైపు, ముద్దానప్ప తొక్కిసలాట వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు ఊరట.. ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు