Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్న నోట్లు ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు : చంద్రబాబు అసహనం

దేశంలో చెలామణిలోకి చిన్న నోట్లు వచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తంచేశారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా రాష్ట్రంలో పేదవారు ఇబ్బంది పడకూడదన్నారు.

Advertiesment
AP CM Chandrababu Naidu
, మంగళవారం, 22 నవంబరు 2016 (09:51 IST)
దేశంలో చెలామణిలోకి చిన్న నోట్లు వచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తంచేశారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా రాష్ట్రంలో పేదవారు ఇబ్బంది పడకూడదన్నారు. ఇలాంటి కష్టకాలంలో పేదలకు అండగా ఉండాలన్నారు. రాష్ట్రానికి తాజాగా రూ.2 వేల కోట్లు సరఫరా అయితే అందులో రూ.1500 కోట్లు రెండు వేల రూపాయల నోట్లేనని గుర్తు చేశారు. ఈ నోట్లతో ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న చిల్లర, చిన్న నోట్ల కష్టాలపై ఆయన స్పందిస్తూ... చిన్న నోట్లు వచ్చే పరిస్థితి లేదని, సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో స్పష్టంగా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఒక పక్క రిజర్వుబ్యాంకు నుంచి అధిక డబ్బు రాబట్టుకునేందుకు ఒత్తిడి తెస్తూనే మరోవైపు చిల్లర సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలో సంపూర్ణంగా ఆనలైన్, డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడమే మార్గమన్నారు. 
 
రాష్ట్రంలోని జన్ ధన్ ఖాతాలన్నింటినీ క్రియాశీలం చేయాలి. అందరికీ రూపే కార్డులు అందించాలి. ప్రతి పౌరుడు చేపట్టే బ్యాంకు లావాదేవీలను డిజిటలైజ్‌ చేయాలి. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ఆర్బీఐ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల నోట్లు వివరాలు, పంపిణీ చేసే విధానం ఎప్పటికప్పుడు తెలియజేయాలి. బ్యాంకులు ప్రతి గ్రామంలోను బిజినెస్‌ కరస్పాండెంట్లను నియమించాలి. రేషన్ డీలర్లను ఇందుకు తీసుకోవాలి. ఇది సంక్షోభ సమయం. ఒక్క పేదవాడు కూడా ఇబ్బందిపడకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది ఆయన వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనంతపురం అభివృద్ధి కోసం కాళ్లు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా... జేసీ దివాకర్ రెడ్డి