Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయాలి: మండలి బుద్ధప్రసాద్

అమరావతి : తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదికను సమర్పించిందని డిప్యూటీ స్పీకర్, కమిటీ సభ్యులు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ చాంబర్లో మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల

Advertiesment
AP Deputy Speaker Mandali Budhaprasad
, మంగళవారం, 30 మే 2017 (21:37 IST)
అమరావతి : తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదికను సమర్పించిందని డిప్యూటీ స్పీకర్, కమిటీ సభ్యులు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ చాంబర్లో మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో.. నివేదికలోని అంశాలను బుద్ధప్రసాద్ మీడియాకు వివరించారు. 
 
తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి 2016 సెప్టెంబర్ 14న ప్రభుత్వం నియమించిన కమిటీ.. ఏడు విభాగాలతో తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయాలని, పాలనలో, బోధనలో తెలుగు ఉండాలని.. తెలుగు భాషాభివృద్ధి కోసం అకాడమీలను ఏర్పాటు చేయడంతో పాటు అనేక ఇతర సూచనలు చేస్తూ.. ప్రభుత్వానికి కమిటీ నివేదిక అందజేసిందని బుద్ధప్రసాద్ వివరించారు. 
 
ఈ అధ్యయన కమిటీ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలలో కవులు, రచయితలు, కళాకారులతో సమావేశాలు నిర్వహించి, వారి విలువైన సూచనలు, సలహాలు తీసుకున్నట్టు చెప్పారు. అలాగే తమిళనాడు, కర్నాటక, ఒడీషా రాష్ట్రాలలో భాషాభివృద్ధికి తీసుకుంటున్న అంశాలను పరిశీలించామన్నారు. ఆయా రాష్ట్రాలలో తెలుగువారిని కలుసుకుని.. వారి సూచనలు కూడా తీసుకున్నట్టు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పర్యటించి.. మూడు అకాడమీలను సందర్శించినట్టు పేర్కొన్నారు. 
 
నాటకరంగం అభివృద్ధి కోసం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను సందర్శించి.. నాటకాల్లో శిక్షణ ఏవిధంగా ఇస్తున్నారో అధ్యయనం చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంచాలకులు డాక్టర్ డి.విజయ్ భాస్కర్ లతో కలిసి.. ముఖ్యమంత్రికి 154 పేజీల నివేదికను సమర్పించామని వివరించారు. నివేదికలోని అంశాలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, వాటిని అమలు పరచడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారని.. బుద్ధప్రసాద్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ భూదందాపై ఉక్కుపాదం... కేఈ క్రిష్ణమూర్తి