Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

Advertiesment
tps stampede

ఠాగూర్

, గురువారం, 9 జనవరి 2025 (18:48 IST)
రాష్ట్ర ప్రజానీకానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగింది.. క్షమించాలని కోరారు. అదేసమయంలో అభిమానులు, పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోయినా బాధ్యతగా వ్యవహరించరా అంటూ మండిపడ్డారు. తప్పు జరిగింది.. క్షమించండి.. ఇంతమంది అధికారులున్నా ఆరుగురి ప్రాణం పోవడం సరికాదన్నారు. తొక్కిసలాట జరిగినా ఇప్పుడు కూడా పోలీసులు జనాలను కంట్రోల్‌ చేయలేరా? అని నిలదీశారు. తితిదే ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరిలు తమ విధుల్లో పూర్తిగా విఫలమయ్యారని, వారు ఈ తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహించాలని కోరారు. అలాగే, మృతుల కుటుంబాలకు తితిదే పాలక మండలి సభ్యులు క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. 
 
తితిదేలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాల్సివుందన్నారు. ఈవో శ్యామల రావు, జేఈవో వెంకయ్య చౌదరి మధ్య గ్యాప్ ఉందని, ఇది ఏమాత్రం సరికాదన్నారు. తితిదే ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సామాన్యుల దర్శనాలపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు. 
 
అంతకుముందు బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల పద్మావతి పార్క్ తొక్కిసలాట ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. ప్రమాద స్థలం పరిశీలన.. భద్రతా ఏర్పాట్లు, తొక్కిసలాటకు గల కారణాలను అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు