Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అసలు జగన్‌కు బుర్రే లేదని తేలిపోయింది : మంత్రి అచ్చెన్నాయుడు

వైకాపా అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి కె. అచ్చెన్నాయుడు మరోమారు విమర్శల వర్షం కురిపించారు. జగన్‌కు బుర్ర పని చేయడం లేదని ఇంతకాలం తాను అనుకున్నాననీ, ఇపుడు అసలు విషయం త

Advertiesment
ap minister atchannaidu kinjarapu
, శుక్రవారం, 24 మార్చి 2017 (11:37 IST)
వైకాపా అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి కె. అచ్చెన్నాయుడు మరోమారు విమర్శల వర్షం కురిపించారు. జగన్‌కు బుర్ర పని చేయడం లేదని ఇంతకాలం తాను అనుకున్నాననీ, ఇపుడు అసలు విషయం తెలిసిందన్నారు. అదేంటంటే.. జగన్‌కు బుర్ర లేదన్న విషయంలో తాను తప్పుడు అభిప్రాయంతో ఇన్నాళ్లూ ఉన్నానని, నేడు అసెంబ్లీలో ఆయన వైఖరి చూస్తుంటే, అసలు బుర్రే లేదని అర్థమైందని వ్యంగ్య విమర్శలు సంధించారు. 
 
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, శుక్రవారం ఉదయం పది నిమిషాల పాటు వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి అసెంబ్లీ సమావేశం ప్రారంభంకాగానే, ఓటుకు నోటు కేసులో తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు అనుమతించాలని వైకాపా పట్టుబట్టింది. ఆ పార్టీ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తుండటంతో, పలువురు తెలుగుదేశం సభ్యులు వైకాపా వైఖరికి నిరసన తెలుపుతూ ప్రతి నినాదాలు చేశారు. ఈ కేసు ఓ పనికిమాలినదని చెప్పారు. దీనిపై చర్చే అవసరం లేదని తేల్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బయటకు రారా తేల్చుకుందాం... నీ.. అసెంబ్లీ వేదికగా టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు