Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభ వల్లే కోడెల ఆత్మహత్య : చీఫ్ విప్

Advertiesment
Kodela Suicide
, మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (14:53 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెట్టిన మానసిక క్షోభ వల్లే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారనీ ఏపీ ప్రభుత్వ విప్ జి.శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఏది ఏమైనా కోడెల మరణం బాధాకరమని, ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 
 
ఇదే అంశంపై శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, తమకు శవరాజకీయాలు చేయడం తెలియదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోడెల మృతదేహం పక్కన మాట్లాడుతుంటే అసలు మనిషేనా అనే అనుమానం కలుగుతోంది. 
 
కోడెల బ్రతికి ఉన్నప్పుడు హింసిస్తారు.. చనిపోయిన తర్వాత శవ రాజకీయాలు చేస్తారు. ఎన్టీఆర్ బతికి ఉన్న సమయంలోను మానసికవేదనకు గురిచేసి ఆయన శవం పక్కన రాజకీయాలు చేశారు.. హరికృష్ణ, లాల్ జాన్ బాషా విషయంలో చంద్రబాబు అలానే చేశారు. బతికి ఉండగా కోడెలను మానసిక వేదనకు గురిచేశారు. 
 
కోడెల గతంలో ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కనీసం చంద్రబాబు పరామర్శించలేదు. శవ రాజకీయాలతో ప్రజల్ని రెచ్చకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వర్ల రామయ్య కోడెలపై తీవ్ర విమర్శలు చేశారు. కోడెల వల్ల పార్టీ భ్రష్టుపట్టి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల ఫర్నీచర్ దొంగలించడం తప్పుని వర్ల రామయ్య మాట్లాడారు. 
 
కోడెల ఆత్మహత్యపై అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకరు తాడుతో అంటే మరొకరు లుంగీతో అని, మందు వికటించని, ఇంకొకరు గుండెపోటు అని మాట్లాడుతున్నారు. కోడెల ఆత్మహత్యకు వైస్సార్సీపీకి ఏమి సంబంధం, కోడెలపై కేసులు పెట్టింది టీడీపీ నాయకులే. వైస్సార్సీపీ నాయకులను నరికి చంపిన ఘనత టీడీపీది.
 
శవ యాత్రలు శవ రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం. వైఎస్ రాజారెడ్డి, చెరుకులపాడు నారాయణ రెడ్డిని చంపిన హంతకులను మీ ఇంట్లో పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుది. కోడెల, కొడుకు, కుమార్తె వలన చనిపోయారని వర్ల రామయ్య స్వయంగా తెలిపారు. 
 
ఛలో ఆత్మకూరు చేపట్టినప్పుడు కోడెలను ఎందుకు చంద్రబాబు పిలవలేదు. పార్టీ మీటింగ్‌లకు కోడెలను చంద్రబాబు ఆహ్వానించలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయకుండా కోడెల క్యారెక్టర్‌ను కించపరిచింది చంద్రబాబు కాదా? చంద్రబాబు కళ్ళలో నుంచి నీళ్లు తెప్పించడానికి ఎల్లో మీడియా ఎంతో ప్రయత్నం చేస్తోంది. 
 
అచ్చెన్నాయుడు ఉద్యోగులను యుజిలేస్ ఫెల్లో అంటే కేస్ పెట్టారా? టీడీపీ నేతలు దళితులను కులం పేరుతో తిడితే కేస్ పెట్టారా? చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే చరిత్ర హీనుడుగా మిగిలిపోతావు. కోడెల చనిపోయిన తరువాత ఐదు ఆరు గంటలకు వరకు చంద్రబాబు మాట్లాడలేదు.
 
చంద్రబాబు మానసిక క్షోభపై కోడెల ఏమైనా లెటర్ రాసారు అని పదే పదే అడిగేవారు. కోడెల ఎలాంటి లేఖ రాయలేదని తెలిసిన తర్వాత చంద్రబాబు రాజకీయ డ్రామా మొదలు పెట్టారు. కోడెలను చంద్రబాబు మానసికంగా వేధించడం వలనే చనిపోయారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. షార్ట్‌సర్క్యూటే కారణమా?