Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఐడీ విచారణకు ఆదేశిస్తేనే ఉలిక్కిపడుతున్నారు : నాదెండ్ల మనోహర్

Advertiesment
nadella manohar

ఠాగూర్

, గురువారం, 5 డిశెంబరు 2024 (22:52 IST)
కాకినాడ పోర్టు అంశంలో బెదిరించి, బలవంతంగా షేర్లు తమకు బదలాయించుకున్న అంశంపై ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో ఈ కేసులో ఏ1గా ఆరోపణలు ఎదుర్కొంటున్న తితిదే మాజీ చైర్మన్, వైకాపా ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి అరెస్టు కాకుండా ఉండేందుకు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఈ కేసులో ఏ2గా ఉన్న వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీనిపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటరిచ్చారు. కాకినాడ పోర్టు అంశంలో సీఐడీ విచారణకు ఆదేశిస్తే ఉలిక్కిపడుతున్నారనీ, ఇంకా విచారణ ప్రారంభం కూడా కాలేదన్నారు. కొంత సమయం ఓపిక పడితే, ఎన్ని కుట్రలు చేశారో ప్రజలకు తెలుస్తాయన్నారు. 
 
అలాగే, బియ్యం అక్రమ రవాణాపై ఇప్పటివరకు 1066 కేసులు నమోదు చేయగా, 1.20 కోట్ల టన్నుల బియ్యం అక్రమ జరిగిందన్నారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ కలెక్టరేట్‌లో ప్రాంతీయ పౌరసరఫరాల శాఖపై జరిగిన సమీక్షకు ఆయన హాజరయ్యారు. 
 
ఉత్తరాంధ్రలో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఒక్క ఉత్తరాంధ్రలోనే 1.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే నగదు జమచేశాం. విశాఖ, కృష్ణపట్నం పోర్టుల కంటే రెండింతల బియ్యం కాకినాడ పోర్టు నుంచి తరలిపోయిందన్నమారు. కాకినాడ పోర్టు ద్వారా అక్రమ రవాణాలో కొందరు సీనియర్ అధికారుల పాత్ర ఉందన్నారు. విశాఖ పోర్టుపైనా దృష్టిసారించాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. 
 
కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో సీజ్ చేసిన స్టెల్లా నౌకను అణువణువూ తనిఖీ జరుగుతుందన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని, ఇప్పటివరకు 729 మందిని, 102 వాహనాలను సీజ్ చేసినట్టు చెప్పారు. అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెట్రోల్ బంకులో భర్తకు షాకిచ్చిన భార్య... ఎలా? (Video)