Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిత్తూరు జిల్లాలో కరెన్సీ మాఫీయా.. భారీ కమీషన్‌తో పెద్ద నోట్ల మార్పిడి

ఆధ్మాత్మిక క్షేత్రం చిత్తూరు జిల్లా అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతోంది. పాత పెద్దనోట్ల రద్దుతో నల్లధనం బయటపెడుతుందని ప్రధాని భావిస్తే కొంతమంది అక్రమార్కులు మాత్రం పాత పెద్దనోట్లతో కోట్లు సంపాదించ

Advertiesment
currency mafia
, గురువారం, 1 డిశెంబరు 2016 (14:37 IST)
ఆధ్మాత్మిక క్షేత్రం చిత్తూరు జిల్లా అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతోంది. పాత పెద్దనోట్ల రద్దుతో నల్లధనం బయటపెడుతుందని ప్రధాని భావిస్తే కొంతమంది అక్రమార్కులు మాత్రం పాత పెద్దనోట్లతో కోట్లు సంపాదించేస్తున్నారు. ప్రధాని ప్రకటించిన సమయం దగ్గరపడుతుండడంతో పాత పెద్ద నోట్లను ఈజీగా మార్చేస్తూ కోట్లకు పడగలెత్తేస్తున్నారు. 
 
చిత్తూరు జిల్లా విజయపురం మండలంలో ఇద్దరు యువకులు కలిసి పాత పెద్దనోట్లను కమిషన్‌కు మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే కోట్లరూపాయలకు పడగలెత్తిన మురళి, చంద్ర అనే ఇద్దరు వ్యక్తులు అదేపనిగా మార్చేసుకున్నారు. చెన్నై, బెంగుళూరు రాష్ట్రాల్లోని కొంతమందితో పరిచయాలతో పెంచుకుని డబ్బులను మార్చడం ప్రారంభించారు. ఏపీలోని గుంటూరు జిల్లా చిలుకూరిపేటలో బుధవారం రాత్రి డబ్బులను మారుస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అది కూడా కోటి 30 లక్షల రూపాయలతో. 
 
లక్షకు 50 వేల రూపాయల కమిషన్‌ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. మరింత మంది ముఠాగా ఇందులో ఉన్నారని, ఒక్కో గ్రామంలో ఒక్కొక్కరిని నియమించినట్లు వారు తెలిపారు. దీంతో పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో కస్టమర్లకు శుభవార్త : 2017 మార్చి వరకు ఉచిత ఆఫర్..