Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)

Advertiesment
Rave party

సెల్వి

, గురువారం, 19 డిశెంబరు 2024 (11:07 IST)
Rave party
నీతి సూత్రాలు చెప్పే నేతలే తప్పుదోవ పడుతున్నారు. బాధ్యతగా వ్యవహరించాలని చెప్పే నేతలే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అదీ జనసేన నేతలు ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఏలూరు జిల్లాలో జనసేన నేతల యవ్వారం బయటపడింది. నిడమర్రు మండలం క్రొవ్విడిలో రేవ్ పార్టీ నిర్వహించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
జనసేన నేత క్రొవ్విడి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు వాకముడి ఇంద్ర పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో అశ్లీల నృత్యాలు చేయించారు. అలా డ్యాన్స్ చేసిన మహిళలతో జనసేన నేతలు సైతం చిందులేశారు. 

క్రొవ్విడి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు వాకమూడి ఇంద్రకుమార్‌ పుట్టిన రోజు కావడంతో డిసెంబర్15వ తేదీ రాత్రి సమీపంలోని బావాయిపాలెం రైస్‌మిల్లులో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఏడు గంటల నుంచి నిర్వహించిన పార్టీలో మండల స్థాయి నాయకులతో కేక్‌ కటింగ్‌ చేసి వివిధ రకాల నాన్‌వెజ్‌ వంటకాలతో భారీగా భోజనాలు ఏర్పాటు చేశారు.
 
ఇలా అశ్లీల నృత్యాలు చేసే మహిళలతో కలిసి డ్యాన్స్ చేసినట్లు గల వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది. జనసేన నేతలు స్థానికులను తప్పుదోవ పట్టిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ చర్యతో జనసేన పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

జనసేన నేత వాకమూడి ఇంద్రకుమార్‌ పుట్టిన రోజు వేడుకల్లో మద్యం ఏరులై పారింది. అమ్మాయిలతో పూర్తి అశ్లీలంగా డ్యాన్సులు చేయించడంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆ నేతను జనసేన పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

pic.twitter.com/KQsFib6Kes

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)