Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

Advertiesment
ycp ex mla nawaz basha

ఠాగూర్

, శుక్రవారం, 16 మే 2025 (08:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ గత ప్రభుత్వ పాలకులైన వైకాపా నేతల తీరు మాత్రం మారడం లేదు. వైకాపా ఏలుబడిలో కొనసాగించినట్టుగానే తమ దౌర్జన్యాలు, దాడులు యధేచ్చగానే చేస్తున్నారు. తాజాగా తనకు చెందిన బస్సును మరో ప్రైవేట్ బస్సు ఓవర్ టేక్ చేసింది. దీంతో ఆ బస్సు డ్రైవర్‌పై వైకాపా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా తన అనుచరులతో కలిసి దాడి చేశారు. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
మదనపల్లి మండలం దొనబైలుకు చెందిన హరినాథ్ కొన్నేళ్లుగా మధుసూదన అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కండక్టరుగా పని చేస్తున్నాడు. ఆయన బస్సు బెంగుళూరు నుంచి బయలుదేరి మదనపల్లెకు వచ్చే క్రమంలో వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు చెందిన బస్సును పలుమార్లు మధ్యలో ఓవర్ టేక్ చేసుకుని వస్తోంది. గతంలోనూ పలుమార్లు ఈ రెండు బస్సుల సమయాలపై ఇరువురు మధ్య గొడవలు కూడా జరిగాయి. 
 
గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు మరోమారు మధుసూద మదనపల్లెలోని బెంగుళూరు బస్టాండ్‌కు చేరుకోగా, ప్రయాణికులు ఎక్కుతున్నారు. దీంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా తన అనుచరులతో అక్కడకు చేరుకుని మధుసూదనపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో గాయపడిన మధుసూదన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేసుకుని, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. మరోవైపు, ప్రైవేట్ బస్సు డ్రైవర్‌పై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి చేయడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు