Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తాహసీల్దార్ ఎదుట గొంతు కోసుకున్న రైతు

Advertiesment
suicide

ఠాగూర్

, మంగళవారం, 20 ఆగస్టు 2024 (16:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని బొమ్మనహాళ్ తాహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యకు యుత్నించారు. తాహసీల్దార్ ఎదుటే తన గొంతు తాను కోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. ఎవరూ ఊహించని ఘటనతో ఇది కలకలం రేపింది. గత 15 యేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు తన సమస్యను పరిష్కరించలేదంటూ తారాకపురం గ్రామానికి చెందిన గడ్డం సుంకన్న అనే రైతు ఈ చర్యకు పాల్పడ్డారు. ఆ వెంటనే స్పందించిన తాహసీల్దారు కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి రైతును హుటాహుటిన బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 
 
ఈ ఘటనపై బాధిత రైతు మాట్లాడుతూ, కల్లుదేవనహళ్లి రెవెన్యూ గ్రామ పరిధిలో 6.68 ఎకరాల భూమిని 1974లో తమ తండ్రి లింగప్ప కొనుగోలు చేశారని, ఇందులో శాంతకుమార్ ఒక ఎకరా, నరసింహులు అనే వ్యక్తి 1.5 ఎకరా కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయంపై న్యాయం చేయాలని కోరుతూ 15 ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. పైగా తమపైనే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కింద కేసు నమోదు చేయించారని వాపోయారు. 
 
ఈ విషయమై బొమ్మనహాళ్​ తహసీల్దార్ మునివేలు స్పందిస్తూ, రైతు సుంకన్న కార్యాలయం లోపలికి రాలేదన్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన వెంటనే బయట ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు. రైతు సుంకన్న వద్ద భూమికి సంబంధించిన ఎలాంటి రికార్డులు గాని, ఆధారాలు కానీ లేవని, భూ సమస్యపై రైతులు గత కొన్నాళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో సర్వేయర్ భూమి కొలతలు చేయడానికి వెళ్లిన సమయంలో కూడా రైతు సుంకన్న ఆత్మహత్యకు యత్నించినట్లు వివరించారు. ఇప్పుడు రెండోసారీ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాఠశాల చిన్నారులపై స్వీపర్ అఘాయిత్యం.. దద్దరిల్లిన బద్లాపూర్