Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కూతురు పట్ల అలా ప్రవర్తిస్తావా? కువైట్ నుంచి వచ్చి బంధువును చంపేసిన తండ్రి.. (video)

Advertiesment
Father

సెల్వి

, గురువారం, 12 డిశెంబరు 2024 (12:35 IST)
Father
మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. వీటిని అడ్డుకునే కఠినమైన చట్టాలు రావట్లేదు. ఫలితంగా మహిళలపై వయోబేధాలు లేకుండా జరుగుతున్నాయి. అయితే తన కూతురుకు జరిగిన అన్యాయానికి ఓ తండ్రి తట్టుకోలేకపోయాడు. 
 
తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి ఆ తండ్రి చంపేశాడు. శనివారం కువైట్ నుండి వచ్చిన ఆ తండ్రి... బంధువును హత్య చేసి.. తిరిగి కువైట్ వెళ్లిపోయాడు. బుధవారం వీడియో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో దివ్యాంగుడైన గుట్ట ఆంజనేయులు (59) దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
అయితే కొత్త మంగంపేటకు చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయప్రసాద్ కువైట్‌లో ఉంటున్నారు. దీంతో తమ కుమార్తె (12)ను ఊళ్లో ఉంటున్న చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారు. ఇటీవల వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనవరాలి వరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
ఆ విషయాన్ని బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి తెలిపింది. ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడగ్గా, ఆమె సరిగా స్పందించలేదు. ఆందోళనతో చంద్రకళ కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు నిందితుడు ఆంజనేయులును పిలిపించి మందలించి వదిలేశారు. అయితే ఆ బాలిక తండ్రి మాత్రం కువైట్ నుంచి వచ్చి శనివారం ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేసి వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. 
 
అనంతరం ఈ విషయాన్ని వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశాడు. ఆడ బిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని.. పోలీసులకు లొంగిపోతానని వెల్లడించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ టూర్ ఎఫెక్ట్ - మాజీ సీఎం జగన్‌కు సర్కారు షాక్!