Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హోంమంత్రి వైఖరిని మార్చుకోవాలి.. టీడీపీ

Advertiesment
Home minister
, గురువారం, 12 సెప్టెంబరు 2019 (20:01 IST)
వైసీపీ వంద రోజుల పాలన ప్రజా సమస్యలను గాలికొదిలేసి టీడీపీపై బురద జల్లడమే  ధ్యేయంగా సాగిందని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు.

గురువారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చినవారికి ఓటు వేసే హక్కు ఉందని, కానీ టీడీపీకి ఓటేసిన టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వైసీపీ నేతలు దాడులుచేయడం హేయమైన చర్య అన్నారు.

వైసీపీ బాధితుల తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అణగదొక్కే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలో తన జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. 

పోలీసులు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితులను పెయిడ్‌ ఆర్టిస్టులంటూ హోంమంత్రి మాట్లాడటం తన స్థాయికి తగదన్నారు. విధి నిర్వహణ సరిగా నిర్వహించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. హోం మంత్రి తన వైఖరిని మార్చుకోవాలన్నారు. లేదా రాజీనామా చేయాలి. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా మేలుకోవాలి. లేకపోతే ప్రజలే ఈ ప్రభుత్వానికి తీర్పు చెబుతారన్నారు.
 
దౌర్జన్యాలకు పాల్పడి పబ్బం: ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పొచ్చని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అనేక గ్రామాల్లోని తెలుగుదేశం వారిని పూర్తిగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

గత రెండు మూడు రోజుల నుంచి అనేక గ్రామాల్లో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని భయభ్రాంతానికి గురిచేసి వారు ఊళ్ళల్లో ఉండకుండా చేయాలని చూస్తున్నారు. కొందరు ఈ విషయాలపై వైసీపీ నాయకులు చెబుతున్న తీరు బాధ కలిగిస్తోంది. వెసీపీ నాయకులు వ్యవస్థను పూర్తిగా  చెరిచేస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకుంటే వారిని కాపాడలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది.

శిబిరాల్లో ఉన్నది పెయిడ్‌ ఆర్టిస్టులని హోంమంత్రి చెప్పారు. సమాజాన్ని వేరు చేయాలన్నదే వారి భావన. రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ధోరణిలో వారు పోతున్నారు. ఇది ప్రజలు కూడా గమనించాలి. తెలుగుదేశం పార్టీవారిపైన ఏ కేసులు లేకపోయినా పాత కేసులున్నవారిపక్కన అదర్స్‌ అని రాసి పెట్టుకున్నారు.

ఆ అదర్స్‌ అనేచోట ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతోందన్నారు. ఆరు, ఏడు రోజుల క్రితం ఏ కేసు లేని వ్యక్తిపైన ప్రస్తుతం అప్పటి ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేయడం జరుగుతోంది. బెయిల్‌ వచ్చిన తరువాత మళ్లీ సెకండ్‌ కేసు చూపించారు. ఏ-3గా మళ్లీ కేసు నమోదు చేశారు.

ఈ విధంగా ఆరు కేసుల్లో పేరు యాడ్‌ చేశారు. 8 కేసులు పూర్తయిన తరువాత ఈ రోజు పీడి యాక్టు నమోదు చేయడం జరిగింది. సంవత్సరం రోజులు బెయిల్‌ రాకూడదని చూస్తున్నారు. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇటువంటి దౌర్జన్యాలు జరగడంలేదు. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని భయభ్రాంతానికి గురి చేయాలన్నదే వారి ఉద్దేశం.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భయపడరు. మీ అరాచకాలపు లొంగేది లేదని గట్టిగా చెబుతున్నాను. ఈ సందర్భంగా దౌర్జన్యాలకు గురైన బాధితులు తమ గోడును వినిపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుల, మతపరమైన దూషణలు చేయలేదు.. నన్నపనేని రాజకుమారి