Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెదేపాలో 'కట్టప్ప'లు రెడీగా వున్నారా? కృష్ణారావు వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటి?

ఏపీ మాజీ సీఎస్ కృష్ణారావు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన పోస్టులు కలకలం నేపధ్యంలో మంగళవారం నాడు స్వయంగా ఆయనే మీడియా ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. ఈ సమావేశంలో చాలా మాట్లాడాలని వున్నా.... వివాదాస్పద అంశాలకు కాస్త దూరంగా వున్నట్లు చెప్పుకొచ్చారు. అన్నారే కానీ

Advertiesment
IYR Krishna Rao
, మంగళవారం, 20 జూన్ 2017 (16:00 IST)
ఏపీ మాజీ సీఎస్ కృష్ణారావు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన పోస్టులు కలకలం నేపధ్యంలో మంగళవారం నాడు స్వయంగా ఆయనే మీడియా ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. ఈ సమావేశంలో చాలా మాట్లాడాలని వున్నా.... వివాదాస్పద అంశాలకు కాస్త దూరంగా వున్నట్లు చెప్పుకొచ్చారు. అన్నారే కానీ వివాదాస్పద అంశాలను టచ్ చేస్తూనే మాట్లాడారు. 
 
అందులో మొదటిది... బ్రాహ్మణ సంఘాలకు వున్న సత్రాలను అదేదో చంద్రబాబు నాయుడు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారనీ, ఇది సమంజసం కాదన్నారు. అలాగే తను గత ఆరు నెలలుగా సీఎం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తుంటే ఇప్పటివరకూ లభించలేదన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడును లగడపాటి రాజగోపాల్ కలిస్తే తప్పు లేదు కానీ కోన రఘును నేను కలిస్తే తప్పా అంటూ సూటి ప్రశ్న సంధించారు. 
IYR Krishna Rao
 
అసలు బ్రాహ్మణ కార్పోరేషన్‌కు సంబంధించిన సమావేశాల తాలూకు విషయాలు వైసీపికి ఎలా చేరుతున్నాయో... తెదేపాలో ఏం జరుగుతుందో ఆ పార్టీ చెక్ చేసుకుంటే మంచిదని హితవు పలికారు. దీన్నిబట్టి తెదేపాలో కట్టప్పలు పుష్కలంగా వున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోసమే ఈ కట్టప్పలు రెడీగా వున్నారనీ, అవి వచ్చినప్పుడు అటు వైసీపి లేదంటే ఇటు జనసేనలోకి జంప్ చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాపం పెద్దాయన!... పార్టీ కోసం జీవితాన్ని ధారపోస్తే చివరికి మిగిలింది కన్నీరే...