Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేచురల్ డిజాస్టర్‌కు మ్యాన్ మేడ్ డిజాస్టర్ తేడా ఏంటో తెలుసా మిస్టర్ జగన్ : నాగబాబు

Advertiesment
nagababu

ఠాగూర్

, మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (13:34 IST)
నేచురల్ డిజాస్టర్‌కు మ్యాన్ మేడ్ డిజాస్టర్ తేడా ఏంటో తెలుసా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అంటూ జనసేన పార్టీ నేత, సినీ నటుడు కె.నాగబాబు ప్రశ్నించారు. విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో మాజీ సీఎం జగన్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు వరద బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటూ సెలవిచ్చారు. దీనిపై నాగబాబు స్పందించారు. తన ట్విట్టర్ వేదికగా ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కృష్ణానది వరదల విజిట్‌కి వచ్చి, వరదల్ని Man Made Disaster అని సెలవిచ్చారు. ఒకసారి క్రింద పేర్కొన్నది చదవండి. "మూడేళ్ల క్రితం (2021) అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి 44 మంది మృత్యువాత పడ్డారు. 15 మంది జాడ తెలియలేదు. ఐదు ఊర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వందలాది పశువులు చనిపోయాయి. ఎటుచూసినా కూలిన ఇళ్లు. ఇంకా గూడారాల మధ్యనే అనేకమంది నివాసం.
 
చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతారు. అందుకోసం నదిలో లారీలు దిగుతాయి. డ్యాం గేట్లు ఎత్తితే అవి వరదలో చిక్కుకుపోతాయి కాబట్టి, వాటినిపైకి తరలించే వరకూ డ్యాం గేట్లు ఎత్తనివ్వకుండా ఆపారనేది ప్రధాన ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్వహణ లోపం వలనే అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని, ఇది దేశంలో ఒక కేస్ స్టడీ అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ పార్లమెంటు వేదికగా వెల్లడించారు. 
 
దీన్ని అంటారు సార్... Man Made Disaster అని. ఒకసారి మీరు first class student కాబట్టి Natural  Disasterకి Man made Disasterకి తేడా తెల్సుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు డ్యాం గేటు సకాలంలో రిపేరు చేయకపోవడం వలన, మీ బృందం ఇసుక అక్రమంగా మితిమీరి రవాణా చేయడం వలన జరిగిన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడాన్ని అంటారు Man Made Disaster అని గమనించగలరు. వీలైతే ముంపు ప్రాంతాల్ని పర్యటించి వరదల ద్వారా ఆస్తులు నష్టపోయిన బాధితుల్ని ఆర్ధికంగా ఆదుకుంటే బాగుంటుంది. విమర్శలే కాదు విపత్తు సమయంలో వీలైన సాయం కూడా చేస్తే బావుంటుంది అని విన్నవిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ మార్కెట్లోకి వివో నుంచి Vivo T3 Pro 5G.. ఫీచర్స్