Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చికెన్ పకోడీ చిచ్చు పెట్టింది.. ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్నాడు..

Advertiesment
Krishna
, బుధవారం, 21 ఆగస్టు 2019 (12:20 IST)
చికెన్ పకోడీ కోసం ప్రేమికుల మధ్య ఏర్పడిన వివాదం.. ఒకరి ఆత్మహత్యకు దారితీసింది. ప్రియుడు ఎంతో ప్రేమగా చికెన్ పకోడీ తీసుకొస్తే.. ప్రియురాలు తనకొద్దని చెప్పేసింది. ఇంకా తినలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా, గుడివాడ ధనియాల పేటకు చెందిన తెర్లి శ్రీను (25) అదే ప్రాంతానికి చెందిన వివాహితతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీను ఆమె ఈ నెల 19వ మచిలీ పట్నం వెళ్లొచ్చారు. అక్కడి నుంచి వస్తూ శ్రీను మద్యం, కోడి పకోడీ తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి ఫూటుగా మద్యం తాగిన శ్రీను ఆమెను కోడిపకోడి తినమని బతిమాలుతూ పలుమార్లు తినిపించే యత్నం చేశాడు. 
 
దీనికి ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆమెతో వివాదానికి దిగాడు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆమె తన పాపను స్కూలు వద్ద దించి వచ్చే సమయానికి శ్రీను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుష్టశక్తులు ఆవహించాయనీ.. త్రిశూలంతో కళ్లు పీకేశారు.. ఎక్కడ?