Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

Advertiesment
venkateswara swamy

ఠాగూర్

, శుక్రవారం, 20 డిశెంబరు 2024 (21:59 IST)
తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం దక్కాలంటే అదో కల. ఒకవేళ టిక్కెట్ లభించి, ఏడు కొండలపైకి వెళ్లినా అక్కడ గంటల తరబడి వేచి చూడాల్సివుంది. అయితే, ఇపుడు కేవలం గంటలో దర్శనం భాగ్యం కలగనుంది. గతంలో మాదిరిగా రోజుల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే ఇబ్బంది లేకుండా గంటలోనే శ్రీవారి దర్శనం కల్పించేలా చేస్తామని తితిదే కొత్త చైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలో గంటలో శ్రీవారి దర్శన కార్యాచరణకు తొలి అడుగుపడింద. వారం రోజుల పాటు చేపట్టే పైలెట్ ప్రాజెక్టుకు శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టారు. గంటలోపే దర్శనం విధి విధానాలను తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. 
 
ఈ విధానం మేరకు.. తొలుత భక్తుల ఆధార్ కార్డు నంబరు ఫేస్ రికగ్నిషన్ తీసుకుని రశీదు ఇస్తారు. స్వామివారి దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్ ఇస్తారు. టోకెన్‌లో నిర్ధేశించిన సమయానికి భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెస్ వద్దకు చేరుకోవాలి. ఫేస్ రికగ్నేషన్ స్కానింగ్ అనంతరం వారిని క్యూలైన్లలోకి అనుమతిస్తారు. ఆ విధంగా క్యూలైన్‌లోకి ప్రవేశించిన భక్తులు గంటలోనే శ్రీవారిని దర్శనం చేసుకుని ఆలయం బయటకు వచ్చేస్తారు. 
 
ఈ తరహా టిక్కెట్ల జారీకి తితిదే 45 కౌంటర్లు ఏర్పాటు చేయనుంది. సిబ్బందితో పనిలేకుండా ఏఐ టెక్నాలజీని విస్తరించాలని తితిదే భావిస్తుంది. నాలుగు విదేశీ సంస్థలు ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ముందుకురాగా, ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. గంటలోపు దర్శనం పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఈ నెల 24వ తేదీన జరిగే తితిదే పాలక మండలి సమావేశంలో ఆమోద ముద్ర వేసి అమల్లోకి తెస్తామని తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!