Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలే.. ఆ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్

Advertiesment
rain

ఠాగూర్

, సోమవారం, 11 నవంబరు 2024 (08:34 IST)
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా, రాయలసీమ, దక్షిణ కోస్తాలకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ, నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, దీని ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 
 
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి మంగళవారంలోపు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ దిశగా కదిలి తమిళనాడు లేదా శ్రీలంక తీరాలవైపు పయనించే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, ఆదివారం ఏపీలో పలుచోట్ల తేలికపాటు వర్షాలు కురిసిన విషయం తెల్సిందే. 
 
నెల్లూరు దగదర్తిలోనే ఎయిర్ పోర్టు.. సిద్ధమవుతున్న డీపీఆర్‌లు 
 
నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణం జరుగనుంది. ఇందుకోసం ప్రభుత్వం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)లు సిద్ధం చేస్తుంది. కొత్తగా వీటిని సిద్ధం చేసి రెండు నెలల్లో టెండర్లు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు అధికారులకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నిజానికి 2019లోనే ఎయిర్‌పోర్టు నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 
 
ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం అటకెక్కింది. ఇపుడు మళ్లీ చంద్రబాబు సారథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకావడంతో ఈ విమానాశ్రయానికి మహర్ధశ వచ్చింది. నెల్లూరు జిల్లాలో విమానాశ్రయాన్ని దగదర్తిలోనే నిర్మించాలని కూటమి సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలో కదలిక వచ్చింది. 
 
విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూములు అందుబాటులో ఉండటంతో పాటు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని అనుమతులను ఇప్పటికే మంజూరు చేసింది. దీంతో ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం కొత్త డీపీఆర్‌లను సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ధరల ప్రకారం అంచనాలు వేసి 2 నెలల్లో టెండర్లు ఆహ్వానించాలని సూచించింది. గుత్తేదారు సంస్థను ఎంపిక చేసిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరు దగదర్తిలోనే ఎయిర్ పోర్టు.. సిద్ధమవుతున్న డీపీఆర్‌లు