Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రోకర్‌లా వ్యవహరించి టీడీపీని బ్రోతల్‌ హౌస్‌లా నడిపిస్తున్నావ్.. మోత్కుపల్లి

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును ఒక బ్రోకర్ అని, టీడీపీని ఒక బ్రోతల్ హౌస్ అంటూ

Advertiesment
Motkupalli Narasimhulu
, మంగళవారం, 29 మే 2018 (15:58 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును ఒక బ్రోకర్ అని, టీడీపీని ఒక బ్రోతల్ హౌస్ అంటూ ఆయన నిప్పులు చెరిగారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి... టీడీపీ చీఫ్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోత్కుపల్లి ప్రసంగం ఆయన మాటల్లోనే.
 
"చంద్రబాబు విశ్వాస ఘాతకుడని నేను కాదు.. ఎన్టీఆరే చెప్పారు. కాంగ్రెస్‌లో ఓడిపోయి, శరణుశరణంటూ టీడీపీలోకి వచ్చి, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నరహంతకుడివి. చివరికి పార్టీ జెండాను లాక్కున్న దొంగవి. రాజకీయాల్లో నీఅంత నీతిమాలిన వ్యక్తి లేడు. నీ జీవితమే అవినీతికి కుట్రలకు, మోసాలకు నిలయం. పార్టీ పెట్టిననాడు ఎన్టీఆర్‌ వెంట ఉన్న నాలాంటి పేదలను టార్చర్‌ చేసిన క్రూరుడివి. సీనియారిటీకి విలువ లేదన్న బాధతోనేకదా గాలి ముద్దుకృష్ణమ లాంటి సీనియర్లు 20 మందిదాకా చనిపోయింది. జెండాను నమ్ముకున్న మాలాంటి వాళ్లను కాదని, నీలాంటి దొంగలను పార్టీలో చేర్చుకున్నావ్‌. నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా జెండా కోసం మాత్రమే వెంట ఉన్నాను తప్ప, పదవుల కోసం కాదు. 
 
అంతేకాకుండా, మరో 10 ఏళ్లూ ఇక్కడే ఉంటా, పార్టీని కాపాడుకుంటా అని అన్నావ్‌, దొంగలాగా రాత్రికిరాత్రే పారిపోయావ్‌. రేవంత్‌ రెడ్డితో నువ్వు చేయించిన కుట్రతో పార్టీ పరువు గంగలో కలిసింది. ఆ తర్వాతైనా రేవంత్‌ని కట్టడిచేయలేదు. కాంగ్రెస్‌ వాళ్ల నుంచి విమర్శలు రాకూడదనేకదా రేవంత్‌ను ఆ పార్టీలోకి పంపింది. ఇప్పుడు నేను అడుగుతున్నా... ఆ ఆడియోలో వాయిస్‌ నీది కాదని చెప్పగలవా? ఆ గొంతు విన్న ప్రతిఒక్కడూ టీడీపీ నాయకుల నోట్లో ఉమ్మి ఊశారు. బ్రోకర్‌ పనులు చేస్తూ టీడీపీని బ్రోతల్‌ హౌస్‌లా నడిపిస్తున్నావ్‌.. థూ.. నీ మీద మన్నుపడ! ఎన్టీఆర్‌ ఆశయాల కోసం పార్టీలో చేరిన నాలాంటి పేదల జీవితాలను నాశనం చేశావుకదా.. ఈ పాపం ఊరికే పోదు. నోరుతెరిస్తే సత్యహరిశ్చంద్రుడి తమ్ముడిలాగా ఉపన్యాసాలు ఇస్తావ్‌.. మనస్సాక్షిలేని మూర్ఖుడివి నువ్వు అంటూ ఘాటైన పదజాలంతో దుమ్మెత్తి పోశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్పొరేటర్లుగా గెలవలేని వారిని కూడా మంత్రులు, ఎమ్మెల్సీలుగా చేశాం : నారా లోకేశ్