Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంత్రి హోదాలో వచ్చా ... కారులో కొట్టిన డీజిల్ నా డబ్బుతోనే కొట్టించా... : మంత్రి నారా లోకేశ్ (Video)

Advertiesment
nara lokesh

ఠాగూర్

, సోమవారం, 27 జనవరి 2025 (13:26 IST)
గత 2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై వేసిన పరువునష్టం దావా కేసులో ఏపీ విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ సోమవారం విశాఖపట్టణం కోర్టుకు హాజరయ్యారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన న్యాయమూర్తి కేసు విచారణను వాయిదా వేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ, సాక్షి తప్పుడు కథనంపై గత 5 ఏళ్ళుగా న్యాయ పోరాటం చేస్తున్నాను. ఇది నాలుగో వాయిదా. నిజం నా వైపు ఉంది, ఎన్ని సార్లు అయినా కోర్టుకు వస్తాను. ఆలస్యమైనా నిజం తెలుస్తుంది అన్నారు. 
 
ఈ రోజు కూడా మంత్రి హోదాలో వచ్చినా, పార్టీ ఆఫీసులో బస్సులో పడుకుంటున్నా. ప్రభుత్వం నుంచి ఒక్క వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు. వచ్చిన వాహనం, అందులో కొట్టిన డీజిల్ కూడా నా డబ్బుతోనే. ఎక్కడా ప్రభుత్వం పై ఆధారపడకూడదని నా తల్లి నాకు చిన్నప్పట్టి నుంచి నేర్పించిందని అని చెప్పారు. 
 
గతంలో కూడా విశాఖ విమానాశ్రయానికి పలుమార్లు వచ్చానని, టీడీపీ ప్రభుత్వం తనపై లాంజ్‌లో రూ.25 లక్షలు ఖర్చుపెట్టిందని సాక్షి తన కథనంలో రాసిందని మంత్రి ఆరోపించారు. దీనిపై అప్పట్లోనే పరువునష్టం దావా వేశానన్నారు.
 
ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే రీజాయిండర్ ఇవ్వాలని నోటీసులు జారీ చేశామని చెప్పారు. పదే పదే ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం కూడా మంత్రి హోదాలో విశాఖకు వచ్చినా పార్టీ ఆఫీసులో బస్సులో నిద్రించినట్లు తెలిపారు. అక్కడ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు.
 
వాటర్ బాటిల్స్, రవాణాకు వాహనాలు సైతం తన సొంత డబ్బు నుంచే ఖర్చుపెట్టుకున్నట్లు చెప్పారు. ఈ విషయం తన తల్లి భువనేశ్వరి నుంచి నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు ఇప్పటికి నాలుగుసార్లు హాజరయ్యానని, ఇంకా ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానన్నారు. నిజం తనవైపు ఉందని, ఎప్పటికైనా అది గెలుస్తుందని నమ్ముతున్నట్లు లోకేశ్ చెప్పారు.
 
ఇక మంత్రిగా ఉండటం వల్ల రెగ్యూలర్‌గా పాదయాత్రలు చేయలేమని, కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, వారిని కలిసేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తుంటామన్నారు. ప్రజల నుంచి అర్జీలు తీసుకుని వారి సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధితో పాటు ఇటు సంక్షేమంపై ఫోకస్ చేసిందని మంత్రి చెప్పుకొచ్చారు.
 
ఇక గత ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టిందని తెలిపారు. ఆ బకాయిలు వరుసగా తాము కట్టుకుంటూ వస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగించినా అహర్నిశలు కష్టపడతానని అన్నారు. తనవల్ల పార్టీకి ఏనాడూ చెడ్డపేరు రాకుండా చూసుకుంటానని తెలిపారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

YS Jagan: జగన్మోహన్ రెడ్డికి ఊరట.. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత