ఏపీలోని నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద నెల్లూరు - ముంబై జాతీయ రహదారిపై గత బుధవారం ఇసుక ట్రక్పు వేగంగా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు ఇపుడు కీలక మలుపు తిరిగింది. దీంతో ఈ కేసు ఎక్కడ వివాదమవుతుందోనని పోలీసులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ఆయన స్థానంల ఆత్మకూరు మండలం చెర్లోయడవల్లి గ్రామానికి చెందిన యువకుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ, ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. దీనికి కారణం ఆ యువకుడి భార్య పోలీసులకు చేసిన హెచ్చరికలే.
హత్య కేసుతో సమానంగా ఉన్న ఈ వ్యవహారంలో తన భర్త డ్రైవర్‌గా ఉన్నారని పేరు పెడితే జరిగిన గుట్టు విప్పుతానని హెచ్చరించడంతో పోలీసులు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ విషయం జిల్లా ఎస్పీకి చేరింది. అదేసమయంలో ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సమగ్ర విచారణకు ఆదేశించాలని బాధిత కుటుంబ సభ్యులుడు డిమాండ్ చేస్తున్నారు.