Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిత్లీతో పంట దెబ్బతిందనీ ఒడిషా రైతు ఆత్మహత్య...

Advertiesment
Odisha
, శుక్రవారం, 26 అక్టోబరు 2018 (14:21 IST)
తిత్లీ తుఫాను అనేక మంది ప్రాణాలను బలితీసుకుంది. అలాగే అపార నష్టాన్ని కూడా మిగిల్చింది. ముఖ్యంగా, రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. ఫలితంగా ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
 
ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కాలాహండీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెత్తే.. రైతు పేరు పరమానంద లహజల్ (26). భార్య నగలు తాకట్టు పెట్టి 35 వేల రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు.
 
ఆ డబ్బుతో నాలుగు ఎకరాల పొలంలో పంట వేశాడు. అయితే, ఇటీవల తిత్లీ తుఫాను సృష్టించిన విధ్వంసానికి పంట పూర్తిగా నీట మునిగిపోయింది. లహజల్ పంట వేసుకుంటే అప్పైనా తీరుతుందని భార్య నగలు పెట్టి మరి డబ్బులు తెచ్చుకున్నాడు. కానీ, ఈ తుఫాన్ వలన అంతా నాశనమైపోయింది.
 
పంట నష్టం జరగడంతో లహజల్ రుణం చెల్లించలేక.. జీవితం భారంగా మారిందనే ఆవేదనతో విషం తాగి పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరప్రదేశ్‌లో గేదెలను అలా దొంగలించారు..