Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో గేట్ పరీక్ష కోసం ఆన్లైన్ తరగతులు

Advertiesment
GATE exam
, శుక్రవారం, 1 మే 2020 (15:54 IST)
జవహర్ లాల్ నెహ్రు సాంకేతిక విశ్వ విద్యాలయాల ఆధ్వర్యంలో ఆన్లైన్ గేట్ కోచింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఏప్రిల్ 28న అన్ని యూనివర్సిటీల విసీలతో నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ లో ఈ సూచన చేశారు. మంత్రి సూచన మేరకు ఆన్లైన్ లో గేట్ కోచింగ్ నిర్వహణకు అధికారులు కార్యక్రమ రూపకల్పన చేశారు. 
 
కార్యక్రమం గురించి.... 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, జవహర్ లాల్ నెహ్రూ
సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం
కాకినాడ, యోగి వేమన విశ్వవిద్యాలయం వైయస్ఆర్ కడప,  గేట్ కోచింగ్ నిర్వహిస్తున్నారు.
ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 3 మరియు 4 వ సంవత్సర విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు.
 
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్సై న్స్ & ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నోలో ఈ అవకాశం పొందవచ్చు. 
 
ప్రతి సెషన్. ప్రతి విద్యార్థికి రోజుకు రెండు సబ్జెక్టులు ఆన్‌లైన్ ద్వారా బోధించబడతాయి. ఇద్దరు వేర్వేరు అధ్యాపకులు. ఆన్‌లైన్ హాజరును పరిశీలిస్తారు.
 
విద్యార్థుల నమోదు......
ప్రతి విషయాన్ని అధ్యాపక సభ్యులు, ఈ క్రింది వెబ్‌పోర్టల్ నుండి వివరాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. www.jntua.ac.in/gate-online-classes/list-of-faculty
 
విద్యార్థులు ఆన్‌లైన్ గేట్ కోచింగ్ తరగతుల కోసం ఈ క్రింది వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చు.
 www.jntua.ac.in/gate-online-classes/registration
 
తరగతుల షెడ్యూల్ కో-ఆర్డినేటర్, సంబంధిత విద్యార్థులకు ఈ -మెయిల్ ద్వారా పంపబడుతుంది.
ఇ-మెయిల్: gateonline@jntua.ac.in
 
ముఖ్యమైన తేదీలు:
నమోదు ప్రారంభం : 2020 మే 2 వ తేదీ.
రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ:  2020 మే 7.
తరగతులు ప్రారంభం :  2020 మే 11.
 
కో-ఆర్డినేటర్ల పేర్లు:
1. డాక్టర్ ఎస్. వి. సత్యనారాయణ, డైరెక్టర్ అకడమిక్ అండ్ ప్లానింగ్, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపూర్.. ఇ-మెయిల్: svsatya7.chemengg@jntua.ac.in మొబైల్: 98495-09167
 
2. డాక్టర్ వి. శ్రీనివాసులు, డైరెక్టర్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ సెంటర్వ,  హర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ.. ఇ-మెయిల్: fdc@jntuk.edu.in, మొబైల్: 97012-78555.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ లో పెట్రోల్ ధర లీటరుకి రూ.20 తగ్గింపు!