Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిగ్రీ కళాశాలల సమస్యల్ని తీర్చండి మ‌హాప్ర‌భో!

Advertiesment
pdsu demands fecilities in degree colleges
విజ‌య‌వాడ‌ , బుధవారం, 15 డిశెంబరు 2021 (16:11 IST)
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు మొర‌పెట్టుకుంటున్నాయి. విజ‌య‌వాడ‌లోని ప్రసాదంపాడులో కళాశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ పోల భాస్కర్ కు పిడిఎస్ యు ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. రామ్మోహన్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయన్నారు. 
 
 
ముఖ్యంగా ఆది కవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో బుట్టాయిగూడెం, చింతూరు కేంద్రాల్లో గత నాలుగు సంవత్సరాల క్రితం స్థలం కేటాయించి భవనాల నిర్మాణం పూర్తి చేయలేదు. నిర్మాణాలు అసమగ్రంగా నిలిచి పోయాయ‌ని, వాటిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు, కొవ్వూరు డిగ్రీ కళాశాలలకు స్థలం కేటాయించి వెంటనే పూర్తిస్థాయి భవనాలు నిర్మించాలని అన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పక్కా భవనాలు, అదనపు తరగతి గదులు నిర్మించాలని కోరారు. డిగ్రీలో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలని తెలిపారు. పశ్చిమ ఏజెన్సీ వెనుకబడ్డ బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పరీక్ష సెంటర్ కేటాయించాలని కమిషనర్ ను కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎ. రవిచంద్ర, నగర అధ్యక్షులు ఐ. రాజేష్ ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో అదుర్స్.. ఒక్క రూపాయికి 100 ఎంబీ డేటా