Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముందు మందు.. ఆ తర్వాత విందు... 2 గంటలపాటు ఒకే గదిలో ఎస్సై, శిరీష? క్వార్టర్‌లో ఏం జరిగింది?

హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి, కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్ మరణాలపై మిస్టరీ వీడలేదు. ముందు ముందు, ఆ తర్వాత విందు పార్టీలో పాల్గొన్న వీరంతా... 2 గంటల పాటు ఒకే గదిలో ఎస్ఐ, శ

Advertiesment
Sirisha
, శుక్రవారం, 16 జూన్ 2017 (09:26 IST)
హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి, కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్ మరణాలపై మిస్టరీ వీడలేదు. ముందు ముందు, ఆ తర్వాత విందు పార్టీలో పాల్గొన్న వీరంతా... 2 గంటల పాటు ఒకే గదిలో ఎస్ఐ, శిరీషలు ఉన్నట్టు సమాచారం. ఆ రెండు గంటల పాటు క్వార్టర్‌లో ఏం జరిగిందన్న విషయంపై ఇపుడు పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
పోలీసులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో బ్యుటీషియన్‌ శిరీష, ఎస్ఐ ప్రభాకర్‌ రెడ్డి మరణాల వెనుక ఉన్న కీలకమైన లింకు బయటపడింది. కానీ మరణాలకు దారితీసిన మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు. అది తెలియాలంటే సోమవారం అర్థరాత్రి కుకునూర్‌పల్లిలో ఏం జరిగిందో తెలియాలి. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌ చేరుకునేవరకూ దారిలో ఏం జరిగిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు. 
 
మరోవైపు... రాజీవ్‌, శిరీషల పంచాయతీ తేల్చడానికి శ్రవణ్‌ సోమవారం హైదరాబాద్‌ వచ్చాడు. ముగ్గురూ కలిసి మద్యం తాగుతూ ఘర్షణ పడినట్టు సమాచారం. సమస్య ఎంతకూ తెగకపోవడంతో మద్యం మత్తులోనే కారులో కుకునూర్‌పల్లి బయల్దేరారు. రాత్రి 7 గంటలకు అక్కడికి చేరుకున్నారు. స్టేషన్‌లో కాసేపు కూర్చొని ఎస్ఐతోపాటు ఆయన క్వార్టర్లోకి వెళ్లారు. తమ వెంట తెచ్చుకున్న మద్యం, చికెన్ ముక్కలను నలుగురూ కలిసి, తాగుతూ తిన్నారు. ఇంతలో ‘మీరు ‘ఎంజాయ్‌’ చేయడానికి రామచంద్రాపురం వెళ్లిరండ’ని ఎస్సై ప్రభాకర్‌రెడ్డి రాజీవ్‌, శ్రవణ్‌లను బయటకు పంపించారు. 
 
ఆ తర్వాత రెండు గంటలపాటు ఎస్సై, శిరీష మాత్రమే క్వార్టర్స్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ, పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. శిరీష పెద్దగా కేకలు వేయడంతో రామచంద్రాపురం వెళ్లిన శ్రవణ్‌, రాజీవ్‌లను ఎస్సై వెనక్కి పిలిపించారు. వారు రాగానే ఆమెను తొందరగా తీసుకెళ్లండంటూ బలవంతంగా కారులో ఎక్కించి పంపించేశారు. కారులో వెళుతుండగా శిరీషను ఇద్దరూ కొట్టినట్లు సమాచారం. అయితే, క్వార్టర్స్‌లో రెండు గంటల పాటు శిరీష్, ప్రభాకర్ రెడ్డిల మధ్య ఏం జరిగిందన్న దానిపై ఇపుడు మిస్టరీగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిలతో రాసలీలలు... స్కూలు వ్యవస్థాపకుడే కీచకుడైన వేళ