Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనాధలా పవన్ కళ్యాణ్ విగ్రహం... సగం ముసుగుతో పవన్... అంత అవసరం ఏంటి?

ఇష్టమైన నాయకులు, సెలబ్రిటీలు అంటే అభిమానులు తమ ప్రాణాలను అయినా ఇచ్చేందుకు వెనుకాడరు. నటీనటుల గురించి అయితే ఇక చెప్పక్కర్లేదు. దక్షిణాదిలో ఈ పిచ్చి మరీ ఎక్కువ. కోలీవుడ్ ఇండస్ట్రీలో అయితే అక్కడ ఖుష్బూ, నగ్మా తదితర తారలకు ఏకంగా గుడులు కట్టించారు వారి అభ

Advertiesment
Power Star
, బుధవారం, 7 డిశెంబరు 2016 (12:45 IST)
ఇష్టమైన నాయకులు, సెలబ్రిటీలు అంటే అభిమానులు తమ ప్రాణాలను అయినా ఇచ్చేందుకు వెనుకాడరు. నటీనటుల గురించి అయితే ఇక చెప్పక్కర్లేదు. దక్షిణాదిలో ఈ పిచ్చి మరీ ఎక్కువ. కోలీవుడ్ ఇండస్ట్రీలో అయితే అక్కడ ఖుష్బూ, నగ్మా తదితర తారలకు ఏకంగా గుడులు కట్టించారు వారి అభిమానులు. వారి పట్ల ఉన్న అభిమానాన్ని వారలా చూపుకున్నారు. తాజాగా ఇలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే... జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అంటే చెప్పలేనంత అభిమానంతో ఊగిపోయే ఓ అభిమాని పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని చేయించాడు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఎంతో ఆశగా పవర్ స్టార్ వద్దకు వెళితే.. ఆయన దానిపై అంతగా స్పందించలేదని సమాచారం. దీనితో పూర్తయిన ఈ విగ్రహాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఓ కూడలిలో ముసుగు వేసి అలా వదిలేశారు. 
 
ఐతే ఈదురు గాలులకు పవన్ విగ్రహం ముసుగు సగం తొలగిపోయింది. దీనితో సగం ముసుగులో ఉన్న పవన్ కళ్యాణ్ విగ్రహం అందరికీ దర్శనమిస్తోంది. దీనిపై ప్రజలు ఎవరికిష్టం వచ్చిన కామెంట్లు వేసుకుంటున్నారు. మరి పవన్ తన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదంటే అలా తన విగ్రహానికి ముసుగు వేసే ఉంచాలని సూచిస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్డుల ఉపయోగం.. స్వైపింగ్ మెషీన్లతో తలనొప్పి.. సర్వీస్ ఛార్జీల బాదుడు..