Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేర్ని నాని భార్య జయసుధకు ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు

Advertiesment
perni jayasudha

ఠాగూర్

, సోమవారం, 30 డిశెంబరు 2024 (19:21 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు బిగ్ రిలీఫ్ లభించింది. మచిలీపట్నం కోర్టు ఆమెకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఆమె అరెస్టుపై సోషల్ మీడియాలోనేకాకుండా రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ సాగింది. ఐతే ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడింది. ఆమెకి చెందిన గోదాములో రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో ఆమెకు మరోమారు నోటీసులు జారీ అయ్యాయి. తొలుత 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైయ్యాయంటూ రూ.1.68 కోట్ల జరిమానా విధించారు. ఆ తర్వాత మరిన్ని బస్తాల బియ్యం మాయమైనట్టుగా గుర్తించారు. 
 
మొత్తంమీద గోదాము నుంచి 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు తేల్చారు. ఈ క్రమంలోనే పెరిగిన షార్టేజీకి కూడా జరిమానా చెల్లించాలంటూ జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సోమవారం నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలంటూ పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే పేర్ని నాని రూ.కోటికి పైగా అపరాధం చెల్లించిన విషయం తెల్సిందే. 
 
"మా అత్తను త్వరగా చంపు తల్లీ" అంటూ కరెన్సీ నోటుపై రాసి హుండీలో వేశారు... 
 
మా అత్తను త్వరగా చంపు తల్లీ అంటూ రూ.20 వేల నోటుపై రాసి హుండీలో వేశారో గుర్తు తెలియని ఓ మహిళ. కర్నాటక రాష్ట్రంలోని కలబుర్గి పట్టణంలో ఉన్న భాగ్యమతి అమ్మవారి ఆలయంలోని హుండీలో ఓ కరెన్సీ నోటుపై రాసి ఉన్న అక్షరాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. "అమ్మా.. మా అత్తను త్వరగా చంపు తల్లీ" అంటూ ఓ రూ.20 నోటుపై రాసి హుండీలో వేశారు. ఆ అక్షరాలు కన్నడ భాషలో ఉన్నాయి. పరకామణిలో హుండీ సొమ్మున లెక్కిస్తుండగా ఈ నోటు కనబడింది. అయితే, అత్తను చంపమని రాసింది కోడలో, మరి అల్లుడో తెలియదు కానీ, ఆ నోటు మాత్రం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్జాతీయ సదస్సుతో ఏఐ ఆవిష్కరణను ప్రోత్సహిస్తున్న కెఎల్‌హెచ్‌ హైదరాబాద్