Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం: మా ఇంట్లో మా బావ కుమార్తె ఉండకూడదని...

Advertiesment
Spandana program
, సోమవారం, 14 జూన్ 2021 (20:39 IST)
కర్నూలు: జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు ఉదయం 10.30 గంటల నుండి 12.30 వరకు స్పందన కార్యక్రమం నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి, వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్ల నుండి ఫిర్యాదులు వచ్చాయి.
 
స్పందన కార్యక్రమానికి ఈ రోజు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు వెల్లడి.
 
మా ఇంట్లో మా బావ కుమార్తె ఉండకూడదని ఇల్లు ఖాళీ చేయాలని నన్ను కొట్టి గాయపరిచిన  మేడిదిన్నె శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని చాగలమర్రి మండలం, రాంపల్లె గ్రామానికి చెందిన వెంకటసుబ్బమ్మ ఫిర్యాదు చేశారు.
 
నా మరిది నాగేంద్ర మాకు డబ్బులు కట్టకుండానే మా భాగానికి వచ్చిన ఇంటిని మొత్తం అతనికి ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పాణ్యం మండలం,  భూపానపాడు గ్రామానికి చెందిన సూర్యకళ ఫిర్యాదు చేశారు.
 
నా పొలాన్ని వేలం వేసుకుని మా తమ్ముళ్ళు ఆక్రమించుకున్నారని మిడుతూరు మండలం, దేవనూరు కు చెందిన అబ్దుల్ మియా ఫిర్యాదు చేశారు.
 
మేము ముగ్గురు అన్నదమ్ములం ఆస్తులు పంచుకున్నాము. 26 సంవత్సరాలైనా నా ఆస్తి పత్రాలు ఇంతవరకు ఇవ్వలేదని నా డాక్యుమెంట్లు నాకు ఇప్పించగలరని దేవనకొండమండలం, పి.కోటకొండకు చెందిన పి.సుభాన్ ఫిర్యాదు చేశారు. 
 
మేము ప్రేమ వివాహం చేసుకున్నాం, మా కుటుంబం నుండి నా భర్త కుటుంబానికి, మాకు ప్రాణ రక్షణ కల్పించాలని, రాంగ్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడతున్నారని నంద్యాలకు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేశారు. 
 
మాపై దాడి చేసి మా పొలం ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని చిప్పగిరికి చెందిన రంగప్ప ఫిర్యాదు చేశారు.
 
మా గ్రామంలో దేవాలయం ప్రక్కన్న స్ధలాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని గడివేముల మండలం, కరిమిద్దేల గ్రామానికి చెందిన దేవరాజు ఫిర్యాదు చేశారు.
 
స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువు లోగా  ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు ఈ సంధర్బంగా ఆదేశించారు. 
 
ఈ కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి ఐపియస్ గారు , ఎఆర్ అడిషనల్ ఎస్పీ రాధాక్రిష్ణ గారు, ఎస్పీ గారి పి ఎ నాగరాజు  ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివేకా హత్యకేసులో 8వ రోజు సిబిఐ విచారణ