Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిశ చాలా అందంగా ఉంది.. ఎలాగైనా అనుభవించాలిరా...

Advertiesment
Telangana Doctor Case
, సోమవారం, 2 డిశెంబరు 2019 (11:47 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, పోలీసులు తయారు చేసిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తికి చెందిన లారీకి మహ్మద్ అరీఫ్, శివలు లారీ డ్రైవర్లుగా ఉన్నారు. వీరిద్దరూ కర్ణాటకలోని గంగావతి నుంచి ఇటుక లోడుతో హైదరాబాద్‌ బయలుదేరారు. 
 
మార్గమధ్యంలో స్నేహితులు నవీన్‌, చెన్నకేశవులు వారికి జతకలిశారు. వీరంతా కలిసి తస్కరించిన ఇనుమును అందులో ఎక్కించారు. లారీ మహబూబ్‌నగర్‌ రాగానే ఆర్టీయే అధికారులు పట్టుకున్నారు. అరీఫ్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడం, అధిక లోడు ఉండటంతో లారీని సీజ్‌ చేశారు. 
 
ఈ విషయాన్ని అరీఫ్‌ తన యజమాని శ్రీనివాస రెడ్డికి ఫోనులో చేరవేశాడు. ఆర్టీయే వాళ్లు లారీని తీసుకెళ్లకుండా చూడాలని, అందుకోసం లారీ సెల్ఫ్‌ మోటర్‌ రోప్‌ను లూజ్‌ చేయాలని చెప్పాడు. యజమాని చెప్పినట్టుగానే సెల్ఫ్ మోటార్ రోప్‌ను అరీఫ్ లూజ్ చేశాడు. 
 
దీంతో ఆర్టీయే అధికారులు లారీని తరలించబోగా అది మొరాయించింది. దీంతో వాళ్లు లారీని వదిలేసి ముందుకు వెళ్లిపోయారు. ఆర్టీయే వాళ్లు వెళ్లగానే నలుగురూ లారీని తీసుకొని హైదరాబాద్‌ బయలుదేరారు. మధ్యలో ఇనుమును తుక్కు వ్యాపారి వద్ద అమ్మేశారు. దాంతో వారికి నాలుగు వేల రూపాయలు వచ్చాయి. ఆ సొమ్ముతో జల్సాలు మొదలెట్టారు. 
 
లారీని తీసుకొని నేరుగా తొండుపల్లి వద్దకు వచ్చారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు రోడ్డు పక్కన ఆపి పడుకున్నారు. మర్నాడు ఉదయం 9 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. దాంతో కాస్త ముందుకు వెళ్లి.. తొండుపల్లి టోల్‌ గేటు పక్కన ఖాళీ స్థలంలోకి వచ్చి లారీని ఆపారు. సాయంత్రం ఐదు గంటలకు శివ 4 వేలతో మందు పార్టీ చేసుకుందామని ఒత్తిడి చేశాడు.
 
దీంతో అందరూ కలిసి మద్యం తెచ్చుకుని తాగడం మొదలుపెట్టారు. సాయంత్రం 6 గంటల సమయంలో దిశ వచ్చి లారీ పక్కనే బైకును పార్క్‌ చేసింది. టోల్‌‌గేట్‌ దగ్గర క్యాబ్‌ ఎక్కి గచ్చిబౌలీ వైపు వెళ్లిపోయింది. ఇది చూసిన నలుగురూ.. ఆమె చాలా అందంగా ఉందని, ఎలాగైనా అనుభవించాలని అనుకున్నారు. ఇందుకోసం పక్కా వ్యూహం రచించారు. వారు అనుకున్నట్లే రాత్రి 9 గంటల సమయంలో ఆమె తిరిగి వచ్చి వారి చేతిలో బలైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తోడేళ్ళలా మీదపడ్డారు... కాళ్లు చేతులు పట్టుకునీ.. ప్యాంటు విప్పేసి నరకం చూపారు...