Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయాలనేదే కేంద్రం ఉద్దేశం...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేయాలనేదే కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని మంత్రి అమరనాథరెడ్డి బుధవారం పేర్కొన్నారు. విభజన హామీల్లో ఒక్కటైన కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయలేమని కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో మంత్రి అమరనాథరె

Advertiesment
injustice to Andhra Pradesh
, బుధవారం, 13 జూన్ 2018 (20:03 IST)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేయాలనేదే కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని మంత్రి అమరనాథరెడ్డి బుధవారం పేర్కొన్నారు. విభజన హామీల్లో ఒక్కటైన కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయలేమని కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో మంత్రి అమరనాథరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో విభజన హామీలన్నీ నెరవేరుస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అందులో కడప స్టీల్ ప్లాంట్ కూడా ఒక్కటని చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడును, టిడిపి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకే ఉక్కు పరిశ్రమను ఇవ్వలేమని కేంద్రం చెబుతోందని మంత్రి విమర్శించారు. 
 
"ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. కడపలోనే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ ఉంది. ఇదే విషయాన్ని రాష్ట్రంలో ఖనిజ సంపదపై సర్వే చేసిన మెకాన్ సంస్థ కూడా వెల్లడించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయాలని కంకణం కట్టుకున్న కేంద్రం ఖనిజ సంపద లేదని కాకమ్మ కథలు చెబుతోందని" మండిపడ్డారు.
 
రాష్ట్ర బీజేపీ నాయకుల తీరుపైనా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటివరకు కడప స్టీల్ ప్లాంట్ తెస్తామని చెప్పిన రాష్ట్ర నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాయలసీమకు స్టీల్ ప్లాంట్ తీసుకురాలేని బీజేపీ నాయకులు రాయలసీమ డిక్లరేషన్ చేస్తారన్నారు. బీజేపీ నాయకులు చెప్పే మాటలకు, చేసే పనులకు ఏమాత్రం పొంతన ఉండదన్నారు. నమ్మించి మోసం చేసిన కేంద్రంపై ధర్మపోరాటం చేస్తున్నామని, దానిని మరింత ఉదృతం చేసి కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదు.. తేల్చేసిన కేంద్రం