Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రకాశం జిల్లాలో పిడుగుపడింది... రెండు ప్రాణాలు పోయాయి...

Advertiesment
lightning strike

ఠాగూర్

, సోమవారం, 21 ఏప్రియల్ 2025 (08:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. జిల్లాలోని బేస్తవారిపేట మండలం, పెద్ద ఓబినేనిపల్లెలో పిడుగు పడింది. దీంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ గ్రామానికి చెందిన అనేక మంది యువకులు క్రికెట్ ఆడుతున్న సమయంలో పిడుగుపడింది. దీంతో సన్నీ (17), ఆకాశ్ (18) అనే ఇద్దరు యువకులు చనిపోయారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఓబినేనిపల్లెలో విషాదం అలముకుంది. మృతుల కటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 
 
కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా... 
 
కర్నాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాష్ (68) అనుమానాస్పదంగాస్థితిలో కనిపించారు. బెంగుళూరు నగరంలోని ఆయన నివాసంలో విగతజీవుడుగా కనిపించాడు. ఇది హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఓం ప్రకాష్ బెంగుళూరు నివాసంలో అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయంటూ సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు ఇది సహజ మరణం కాకపోవచ్చని, హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఓ కుటుంబ సభ్యుడు ప్రమేయం ఉండొచ్చనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. 
 
1981 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఓ ప్రకాష్ బీహార్ రాష్ట్రంలోని చంపారన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఎమ్మెల్సీ జియాలజీ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 2015 మార్చి ఒకటో తేదీన కర్నాటక డీజీపీగా బాధ్యతలు స్వీకరించి సమర్థమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
 
ప్రస్తుతం ఓ ప్రకాష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతిగల కారణం తెలుస్తుందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...