జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో ఉగ్రవాగులు పెట్రేగిపోయారు. ఈ ఉగ్రదాడిలో విశాఖపట్టణానికి చెందిన, రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. పారపోతున్న ఆయనను వెంబడించి మరీ కాల్చి చంపినట్టు సమాచారం. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోది.
చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టారిస్ట్‌లు గుర్తించారు. సమాచారం తెలిసిన వెంటనే విశాఖ నుంచి కుటుంబ సభ్యులు పహల్గాంకు బయలుదేరి వెళ్లారు. కాగా, ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను భార్య కరెంట్ షాక్‌తో చంపేసి ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా పొంతూరుకు వెళ్లిపోయింది.
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు... కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్న సాయిలు, కవిత అనే దంపతులు ఉన్నారు. గత 15 యేళ్లు వీరిద్దరూ అనారోగ్యంతో బాధపడుతూ, వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారు.
ఇటీవల కవిత తన సొంతూరు వెళ్లి, భర్త సాయిలు పనికి వెళ్లి తిరిగి రాలేదని తమ కుటుంబీకులను నమ్మించింది. దీంతో అనుమానం వచ్చిన ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు, భర్తను భార్యే చంపినట్టు తేలింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ నెల 18వ తేదీన భర్త వేధింపులు భరించలేక సాములును కరెంట్ షాకుతో చంపేసినట్టు పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటి ప్రాంగణంలోనే పూడ్చిపెట్టింది. అయితే, ఈ హత్యకు ఆమె తన చెల్లి భర్త సహకారం తీసుకున్నట్టు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.