Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమారుడు తాగుబోతు.. కోడలిపై కన్నేసిన మామ... ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని..?

కోడలిపై కన్నేశాడు. తండ్రిలా కాపాడాల్సిన మామే లైంగిక వేధింపులకు గురిచేశాడు. కొడుకు మద్యానికి బానిసగా మారడంతో అవకాశాన్ని ఆసరాగా తీసుకుని కోడలిని లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆ

Advertiesment
Woman
, సోమవారం, 29 మే 2017 (09:45 IST)
కోడలిపై కన్నేశాడు. తండ్రిలా కాపాడాల్సిన మామే లైంగిక వేధింపులకు గురిచేశాడు. కొడుకు మద్యానికి బానిసగా మారడంతో అవకాశాన్ని ఆసరాగా తీసుకుని కోడలిని లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ చాధర్ ఘాట్‌లో ఆజంపుర మర్కస్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి ముగ్గురు కుమారులు, ఇద్దరు బిడ్డలు. భార్య ఇటీవలే మరణించింది. రెండో కొడుకు భార్య, ముగ్గురుపిల్లలతో పాటు మామ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. కూలీ పనిచేసే రెండో కొడుకు తాగుడుకు బానిసగా మారాడు. దీంతో రోజూ కూలీ పనిచేసి వచ్చిన డబ్బులతో మద్యం సేవించడమే ఆయనకు అలవాటుగా మారింది. ఇతని భార్య జీహెచ్ ఎంసీలో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఆమె మామ కామాటీ పనిచేస్తున్నాడు. అయితే తన కొడుకు తాగుడుకు బానిసగా మారడంతో ఈ కోడలిపై ఆయన కన్నేశాడు.
 
కోడలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను మామ లైంగికంగా వేధింపులకు గురిచేసేవాడు. ఇందుకు అంగీకరించకోపతే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని బెదిరించేవాడు. తాగుబోతు భర్తకు చెప్పుకోలేక శనివారం సాయంత్రం ఆమె ఇంట్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్‌ఖైదాకు వారసుడు వచ్చాడు.. చాలా తెలివైనవాడు.. అందగాడు..