Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మాయిని ముద్దైనా పెట్టుకోవాలి.. కడుపైనా చేయాలన్న పెద్ద మనిషిని అరెస్ట్ చేశారా? (video)

Advertiesment
Posani

సెల్వి

, మంగళవారం, 12 నవంబరు 2024 (19:01 IST)
Posani
నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా అరెస్టులపై పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు, మీడియాపై మరోసారి  పోసాని నోరుపారేసుకున్నారు. పనిలో పనిగా నటుడు బాలయ్యను కూడా వదల్లేదు. మహిళలను కించపరిచే వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి ఇస్తారా? అని పోసాని ప్రశ్నించారు. 
 
"నాకు నంది అవార్డు వస్తే.. ఇవి నంది అవార్డులు కాదు.. కమ్మ అవార్డులు అని నా అవార్డును వెనక్కి తిరిగి ఇచ్చాను కుక్కా అంటూ టీటీడీ చైర్మన్‌ను దూషించారు. అయితే నా గురించి పవన్ కల్యాణ్‌కు తెలుసు. నేను ఎలా ఉంటానో.. ఎలా మాట్లాడుతానో ఆయన గ్రహించాలి" అని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు ఒకటే విన్నపం. ప్రజలను కించపరిచే విధంగా వార్తలు ప్రసారం చేసే బీఆర్ నాయుడిని నమ్మకండని పోసాని అన్నారు.
 
అమ్మాయిని ముద్దైనా పెట్టుకోవాలి.. లేదా కడుపైనా చేయాలి అంటూ బాలకృష్ణ కామెంట్ చేశాడు. థూ అనే విధంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇద్దరిపై కాల్చులు జరిపారు. వారు చావుకు దగ్గరయ్యారు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారా? ప్రధానిపై వాడు వీడు అంటూ  నీచమైన కామెంట్లు చేసిన బాలకృష్ణ గురించి ఏనాడైనా మీ ఛానెల్‌లో వేశారా? ఒక్కరోజైనా జైల్లో పెట్టారా? అంటూ ప్రముఖ టీవీ ఛానెల్‌పై మండిపడ్డారు. బాలకృష్ణను అరెస్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేయండి.. అని పోసాని కామెంట్స్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం... లుకౌట్ నోటీసు జారీ