Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిరాయి మూకలతో వైకాపా కార్యకర్తలపై దాడులు.. డీపీజీకి ఆళ్ళ ఫిర్యాదు

Advertiesment
Alla Ramakrishna Reddy
, సోమవారం, 1 జులై 2019 (14:18 IST)
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, వైకాపా ఎమ్మెల్యే రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్‌ను కలిసిన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి రాష్ట్రంలో తెలుగుదేశం పార్డీ కిరాయి మనుషులతో వైఎస్ఆర్‌సిపి శ్రేణులపై దాడులకు తెగబడుతోందని ఫిర్యాదు చేశారు. 
 
వ్యూహాత్మకంగా ఆ దాడులను టీడీపీపైకి నెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలే గ్రామాల్లో, పట్టణాల్లో మా పార్టీ శ్రేణులపై టిడిపి వారు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలోనూ సీఎం, హోంమంత్రి లపై అత్యంత దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు.
Alla Ramakrishna Reddy


చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా మాపై అక్కసుతో వహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు టిడిపి ఇటువంటి అరాచకాలకు పాల్పడుతోంది. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిజిపిని కలిసి ఫిర్యాదు చేశామని ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ నివాసం వద్ద తొక్కిసలాట... అపస్మారక స్థితిలో మహిళ