Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యక్తిగత విషయాలను మా జగన్ పట్టించుకోరు... రాజకీయంగా ఇరికించారు : దువ్వాడ శ్రీనివాస్

Advertiesment
Duvvada Srinu- Madhuri

ఠాగూర్

, ఆదివారం, 13 అక్టోబరు 2024 (12:00 IST)
వైకాపాకు చెందిన నేతల వ్యక్తిగత విషయాను తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టించుకోరని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. పైగా, దివ్వెల మాధురి అంశాన్ని తాను జగన్మోహన్ రెడ్డికి వివరించానని, అందువల్ల ఆయన పట్టించుకోరన్నారు. అయితే, తమను తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించి ఫోటో షూట్ చేశామంటూ కేసు నమోదు చేయడం అనేది రాజకీయ కుట్రలో భాగమని తెలిపారు. 
 
ఇటీవల తిరుమలకు తన స్నేహితురాలు దివ్వెల మాధురితో కలిసి తిరుమలకు వెళ్లిన దువ్వాడ శ్రీనివాస్... శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరుమలలో ఫోటోషూట్ చేశారు. ఇందులోభాగంగా, దివ్వెల మాధురి వివిధ భంగిమల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో తిరుమల పుణ్యక్షేత్రంపై ఫోటోలు దిగారు. అలాగే, రీల్స్ కూడా చేశారు. ఈ ఫోటోలు, రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో దివ్వెల మాధురిపై తిరుమలలో కేసు కూడా నమోదు అయిన విషయం తెలిసిందే.
 
దీనిపై వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. మాధురితో కలిసి ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. తిరుమల ఇష్యూతో రాజకీయంగా ఇరికించాలని భావించారన్నారు. తిరుమల కొండపై తాము ఎలాంటి తప్పు, అపచారం చేయలేదని స్పష్టం చేశారు. మా లాంటి వాళ్లు తిరుమలకు రావచ్చో లేదో టీటీడీ అధికారులు క్లారిటీ ఇవ్వాలన్నారు. నాలుగు రోజుల తర్వాత తమపై కేసులు పెట్టారని అన్నారు. కేసులను కోర్టులో ఎదుర్కొంటామని చెప్పారు.
 
వ్యక్తిగత అంశాలను తమ పార్టీ పట్టించుకోదన్నారు. పార్టీకి వ్యక్తిగత అంశాలను ముడిపెట్టవద్దని ఆయన పేర్కొన్నారు. పార్టీకి తానే ఈ విషయాన్ని తెలియజేసానని, వైసీపీ తనను సస్పెండ్ చేసినా ఫరవాలేదని అన్నారు. ముందుగా టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటే తిరుమలకు వచ్చే వాళ్లం కాదని అన్నారు. ఒక వేళ తిరుమల కొండపై తాము తప్పు చేస్తే భగవంతుడే శిక్షిస్తాడని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరువు లేనోడు పరువునష్టం దావా వేస్తాడా? హీరో నాగార్జునపై సీపీఐ నారాయణ ఫైర్